Site icon HashtagU Telugu

Kerala: ఉత్తమ కోవిడ్-19 వ్యాక్సినేటర్ల అవార్డులకు ఎంపికైన కేర‌ళ నర్సులు

Best Nurses Imresizer

Best Nurses Imresizer

జాతీయ కోవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ఉత్తమ వ్యాక్సినేటర్ల అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఢిల్లీలో గౌరవప్రదంగా ఈ అవార్డుల‌ను వారికి అందజేయనున్నారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను అభినందించారు. తిరువనంతపురంలోని జనరల్ హాస్పిటల్ నుండి గ్రేడ్ వన్ నర్సింగ్ ఆఫీసర్ ప్రియ, కన్నూర్ జిల్లా పయ్యన్నూర్ తాలూకా ఆసుపత్రి నుండి గ్రేడ్ వన్ జూనియర్ పబ్లిక్ హెల్త్ నర్సు (JPHN) T. భవానిలు . కేరళ నుండి ఉత్తమ వ్యాక్సినేటర్‌లుగా ఎంపికైన‌ట్లు ఆమె తెలిపారు. ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకరించిన ఆరోగ్య కార్యకర్తలందరికీ వీణా జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్-19 యొక్క మూడవ వేవ్‌ను అధిగమించడంలో టీకా ముఖ్యమైన పాత్ర పోషించిందని తెలిపారు.

18 ఏళ్లు పైబడిన 100 శాతం జనాభాకు కోవిడ్-19 టీకా యొక్క మొదటి డోస్ ఇవ్వబడిందని, వారిలో 86 శాతం మందికి రెండవ డోస్ కూడా ఇచ్చామ‌ని ఆమె తెలిపారు. అలాగే, 15 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో 77 శాతం మందికి మొదటి డోస్ టీకాలు వేయగా, వారిలో 36 శాతం మంది రాష్ట్రంలో రెండవ డోస్ పొందారని తెలిపారు. అందరికీ టీకాలు వేయడానికి కేరళ ప్రత్యేక టీకా ప్రచారాలను ఏర్పాటు చేసింద‌ని.. త‌మ టీకా కార్యక్రమం విజయవంతం కావడం వెనుక ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారని ఆరోగ్య‌శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

Exit mobile version