కరూర్ తొక్కిసలాట ఘటనపై నటుడు, టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటిది ఎప్పుడూ తన జీవితంలో ఎదుర్కొలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందని విజయ్ అభిప్రాయపడ్డారు. నిజం త్వరలోనే బయటపడుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను భద్రతకే ప్రాధాన్యత ఇస్తానన్న విజయ్.. తనను టార్గెట్ చేయండి కానీ, ప్రజలను కాదని అని పేర్కొన్నారు. త్వరలోనే బాధితులను కలుస్తానని తెలిపాడు. అంతేకాదు, తిరుపతికి వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానని ప్రకటించారు. ‘ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాపై ప్రతీకారం తీర్చుకోడానికి ప్రయత్నిస్తున్నారా? కానీ, మేము ఎలాంటి తప్పుచేయలేదు’ అని విజయ్ పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి సర్.. మీరు ఏదైనా ప్రతీకారం కోసం ప్లాన్ చేస్తే అది నాపైనే చేయండి… మా నాయకులను టచ్ చేయకండి.. నేను ఎక్కడికి పోను ఇళ్లు లేదా ఆఫీసులో ఉంటా’ అని స్టాలిన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025
అయితే, ఈ అభియోగాలపై విజయ్ స్పందిస్తూ.. తానుగానీ, తన పార్టీ గానీ ఎటువంటి తప్పుచేయలేదని అన్నారు. సురక్షిత ప్రదేశంలో ర్యాలీ నిర్వహణ సహా భద్రత ప్రోటోకాల్ అనుసరించామని తెలిపారు. ‘నా పర్యటనలో ప్రజల భద్రతకు సంబంధించిన ఎటువంటి రాజీపడలేదు.. అన్ని రాజకీయ అంశాలను పక్కన పెట్టి, అలాంటి (సురక్షితమైన) ప్రదేశంలో సభ నిర్వహణకు పోలీసుల అనుమతి తీసుకున్నాం’ అని విజయ్ స్పష్టం చేశారు.