Water War : తుంగ‌భ‌ద్రపై క‌ర్ణాట‌క‌తో తెలంగాణ ఫైట్‌

కృష్ణా నదీజలాల వాటాను పెంచుకోవ‌డానికి ఆంధ్రప్రదేశ్‌తో పోరాటం చేస్తోన్న తెలంగాణ ఎగువన‌ తుంగ ప్రాజెక్టులకు కర్ణాటకకు ఇచ్చిన అనుమతులను స‌వాల్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - May 12, 2022 / 04:14 PM IST

కృష్ణా నదీజలాల వాటాను పెంచుకోవ‌డానికి ఆంధ్రప్రదేశ్‌తో పోరాటం చేస్తోన్న తెలంగాణ ఎగువన‌ తుంగ ప్రాజెక్టులకు కర్ణాటకకు ఇచ్చిన అనుమతులను స‌వాల్ చేస్తోంది. అనుమతుల‌ను వెంట‌నే నిలిపివేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి)ని కోరింది. కృష్ణా నదీ ప్రవాహాలకు తుంగభద్ర గణనీయంగా దోహదపడిందని, ప్రస్తుతం రెండు కర్ణాటక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం వల్ల కృష్ణాలోకి వచ్చే ఇన్ ఫ్లోలు త‌గ్గుతుంద‌ని సీడబ్ల్యూసీకి తెలిపింది. తెలంగాణ ప్రయోజనాలను మరింత ప్రమాదంలో పడేస్తుందని సీడబ్ల్యూసీకి రాసిన లేఖలో తెలంగాణ పేర్కొంది.

కర్ణాటకలోని ఏ ప్రాజెక్టుకైనా కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తే రాష్ట్రానికి అభ్యంతరం లేదని తెలంగాణ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ లేఖలో స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-I నీటి వాటాల అవార్డ్‌లో నిర్దేశించిన విధంగా నదీజలాల భాగస్వామ్యం అన్ని అంతర్-రాష్ట్ర అంశాలను పరిశీలించకుండానే ప్రాజెక్ట్‌ను క్లియర్ చేయడంపై స్ప‌ష్టత కోరింది. కృష్ణానది లోటు నదీ పరీవాహక ప్రాంతమని, తెలంగాణలోకి ప్రవేశించే ముందు నది ప్రవహించే రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు దిగువన ఉన్న రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ వాదిస్తోంది. కృష్ణానది మహారాష్ట్రలో ఉద్భవించి, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గుండా బంగాళాఖాతంలో కలుస్తుంది.

తుంగభద్ర సబ్ బేసిన్‌లో కర్ణాటకకు, ఎగువ భద్ర మరియు ఎగువ తుంగ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై భారత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని లేఖలో తెలంగాణ పేర్కొంది. KWDT-II ఎగువ భద్రకు 9 tmc ft (వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగుల) నీటిని మరియు ఎగువ తుంగ ప్రాజెక్టులకు 11 TMC అడుగుల నీటిని కేటాయించింది. సమగ్ర పరిశీలన లేకుండా ఈ కేటాయింపులు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని లేఖలో తెలంగాణ పేర్కొంది.