Site icon HashtagU Telugu

Hiranyakashyap : త్రివిక్రమ్ చేతికి రానా చిత్రం..డైరెక్టర్ ఎవరో ..?

Trivikram Hiranyakashyap

Trivikram Hiranyakashyap

చిత్రసీమలో ఎన్నో జరుగుతుంటాయి. ముఖ్యముగా ఓ హీరోకు అనుకున్న కథ మరో హీరో చేయడం..ఓ డైరెక్టర్ తో అనౌన్స్ అయినా చిత్రం మరో డైరెక్టర్ చేతికి వెళ్లడం జరుగుతుంటాయి. తాజాగా ఇప్పుడు దగ్గుపాటి రానా విషయంలో ఇదే జరిగింది. రానా తో డైరెక్టర్ గుణశేఖర్ హిరణ్యకశ్యప (Hiranyakashyap) అనే భారీ పాన్ ఇండియా మూవీ చేయాలనీ అనుకున్నాడు. ఈ మేరకు ప్రకటన చేయడం , ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టడం చేసాడు. కానీ అదే సమయంలో కరోనా రావడం , సినిమా షూటింగ్ లు ఆగిపోవడం ఇలా జరిగిపోయింది. దీంతో గుణశేఖర్ హిరణ్యకశ్యప ను పక్కకు పెట్టి సమంత తో శాకుంతలం మూవీ స్టార్ట్ చేసారు. రెండేళ్ల పాటు ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది.

దీంతో హిరణ్యకశ్యప (Hiranyakashyap) లేనట్లే అని అంత ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని అటు రానా కానీ డైరెక్టర్ గుణశేఖర్ కానీ ఖండించలేదు. అనూహ్యంగా నిన్న జులై 19న రానా హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే గుణశేఖర్ పేరు లేదు. కొత్తగా త్రివిక్రమ్ (Trivikram) పేరొచ్చి చేరింది. హిరణ్యకశ్యప చిత్రానికి త్రివిక్రమ్ కథ అందిస్తున్నట్లు తెలియజేశారు. డైరెక్టర్ మాత్రం గుణశేఖర్ కాదని పక్కాగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రకటన రాగానే గుణశేఖర్ తన అసహనం ట్విట్టర్ వేదికగా బయటపెట్టాడు. పేర్లు ప్రస్తావించకుండా రానా, త్రివిక్రమ్ లను టార్గెట్ చేశారు. వారికి నైతికత లేదని ఘాటు కామెంట్స్ చేశారు. మొత్తం మీద ఏళ్ల తరబడి హిరణ్యకశ్యప కోసం గుణశేఖర్ పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.