Tribal Village: ఆనంద్ మహీంద్రా మనస్సుదోచిన ఆ చిన్న గిరిజన గ్రామం..!!

కేరళ...తేయాకు తోటలకు ప్రసిద్ధి. వేనాడ్ లోని కొండ ప్రాంతాల అందాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. చుట్టూ ఉండే కొండల మధ్య కేరళ పర్యాటక విభాగం కొన్ని గిరిజన గూడాలను నిర్మించింది.

  • Written By:
  • Publish Date - July 22, 2022 / 02:18 PM IST

కేరళ…తేయాకు తోటలకు ప్రసిద్ధి. వేనాడ్ లోని కొండ ప్రాంతాల అందాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. చుట్టూ ఉండే కొండల మధ్య కేరళ పర్యాటక విభాగం కొన్ని గిరిజన గూడాలను నిర్మించింది. ఈ గూడాలతో పర్యాటకలును ఆకర్షించాలన్నది ఓ ప్రయత్నం. ఈ గ్రామానికి ఎన్నోర్ అనే పేరు కూడా పెట్టారు. కొండల మధ్య 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రామం ఉంటుంది. గిరిజనుల ఇళ్లు ఎలా ఉంటాయి…జీవన విధానాన్ని పరిచయం చేడయమే..ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీంతో పర్యాటకులకు భిన్నమైన అనుభవం లభించనుంది.

2010లో అప్పటి సబ్ కలెక్టర్ ప్రశాంత్ నాయర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. గత నెలలో ఈ ప్రాజెక్టు పూర్తయ్యింది. స్థానిక గిరిజన తెగలతోనే దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు అందాలు ప్రముఖ బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా కంట్లో పడింది. ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో దీన్ని షేర్ చేశారు. ఇది చాలా అందంగా ఉంది. కేరళ టూరిజమ్ కు ధన్యవాదాలు ఈ గ్రామం సహజ నిర్మాణ రూపకల్పన చాలా అద్భుతంగా ఉందంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.