Kerala : 16 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ట్రాన్స్ మ‌హిళ‌.. 7 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు

తిరువనంతపురంలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 16 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ట్రాన్స్ మహిళకు ఏడేళ్ల కఠిన

  • Written By:
  • Publish Date - February 7, 2023 / 09:25 AM IST

తిరువనంతపురంలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 16 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ట్రాన్స్ మహిళకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది. నిందితుడు సచ్చు శాంసన్ (34) తిరువనంతపురం జిల్లా చిరైన్‌కీజుకు చెందిన ట్రాన్స్‌జెండర్. ఓ ట్రాన్స్‌జెండర్‌కు నేరం కింద శిక్ష పడడం కేరళలో ఇదే తొలిసారి. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆజ్ సుదర్శన్ తీర్పులో పేర్కొన్నారు. ఈ ఘటన 2016 ఫిబ్రవరి 23న జరిగింది. చిరాయింకీజు నుంచి రైలులో తిరువనంతపురం వస్తున్న 16 ఏళ్ల బాలుడిని.. ట్రాన్స్ మ‌హిళ కలిశారు. బాలుడిని తంపనూర్ పబ్లిక్ కంఫర్ట్ స్టేషన్‌కు తీసుకెళ్లి అసహజ లైంగిక వేధింపులకు గురి చేశాడనేది ప్రాసిక్యూషన్ కేసు. నిందితుడితో వెళ్లేందుకు బాలుడు నిరాకరించడంతో అక్క‌డ బెదిరించారు. దీంతో భయపడిన బాలుడు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పలేదు.

ఆ తర్వాత ట్రాన్స్ మ‌హిళ పలుమార్లు బాలుడికి ఫోన్ చేసి కొన్ని ప్రాంతాలకు రావాలని కోరగా అతడు నిరాకరించాడు. బాలుడికి నిత్యం మెసేజ్‌లు పంపుతుండడం, ఫోన్‌లో మాట్లాడుతుండగా.. బాలుడు ఆందోళనగా కనిపించడం తల్లి గమనించింది. బాలుడు ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడంతో.. నిందితులు ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా సందేశాలు పంపారు. బాలుడి ఫేస్‌బుక్ ఖాతా త‌న తల్లి ఫోన్‌లో లాగిన్ అయి ఉంది, ఆమె సందేశాలను చూడగానే వేధింపుల గురించి తెలుసుకుని నిందితుడికి సమాధానం ఇచ్చింది. పోలీసుల సూచన మేరకు తల్లి నిందితులకు సందేశాలు పంపి తంపనూరుకు పోలీసులు పిలిపించి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ ఎస్ విజయ్ మోహన్, న్యాయవాదులు ఎం ముబీనా, ఆర్ వై అఖిలేష్ వాదించారు. ప్రాసిక్యూషన్‌ ఏడుగురు సాక్షులను విచారించి.. పన్నెండు పత్రాలు సమర్పించారు. తంపనూరు పోలీస్ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఎస్‌పీ ప్రకాష్ ఈ కేసు దర్యాప్తు చేశారు.