World Popualation : నేటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లు.. జనాభాలో భారత్ చైనాను ఎప్పుడు అధిగమిస్తుందో తెలుసా..?

  • Written By:
  • Updated On - November 15, 2022 / 12:10 PM IST

ప్రపంచ జనాభా నేటికి 8 బిలియన్లు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2030నాటికి వరల్డ్ పాపులేషన్ దాదాపు 8.5బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. యూఎన్ కూడా 2050 నాటికి ప్రపంచ జనాభా 9.7బిలియన్లు దాటుతుందని లెక్కించింది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న దేశాల్లో జననరేట్లు పెరిగినట్లు యూఎన్ తన రిపోర్టులో వెల్లడించింది.

2023లో భారత్ మరో ఘనత:

కాగా ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2023లో భారత్ మరో ఘనతను సాధించి..చైనాను వెనక్కు నెట్టనుంది. ప్రపంచంలోనే అత్యథిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి స్ఫష్టం చేసింది. కానీ 1950 తర్వాత జనాభా పెరుగుదల వేగం కాస్త మందగించింది. 2020లో జనాభా పెరుగుదల రేటు ఒక్కశాతంకంటే తక్కువగా ఉంది. 2022లో జనాభాకు సంబంధించి యూఎన్ వెలువరించిన అంచనాల ప్రకారం…కొన్ని దశాబ్దాలలో ఎన్నో దేశాలలో సంతానోత్పత్తి గణనీయంగా పడిపోయింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండు వంతు స్త్రీలు సంతానోత్పత్తిరేటు 2.1శాతంగా తక్కువగా ఉందని వెల్లడించింది.

61 దేశాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే జనాభా:

ప్రపంచ జనాభా 7 బిలియన్ల నుంచి 8 బిలియన్లు చేరుకునేందుకు పుష్కరకాలం పట్టింది. కానీ ఇప్పుడు 8 బిలియన్ల నుంచి 9 బిలియన్లు చేరుకునేందుకు సుమారు 15ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. ప్రపంచంలో జనాభా పెరుగుదల రేటు తగ్గుతుందని యూఎన్ తన రిపోర్టులో వెల్లడించింది. 61దేశాల్లో జనాభా 2022 నుంచి 2050మధ్య కేవలం 1 శాతం మాత్రమే తగ్గుతుందని అంచాన వేసింది. సంతానోత్పత్తి లేకపోవడం దీనికి బలమైన కారణంగా పేర్కొంది.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి రెండు ప్రాంతాలు:

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2022లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు ప్రాంతాలు ఆసియా నుంచి మాత్రమే ఉన్నాయి. వీటిలో ఆగ్నేసియా,దక్షిణాసియా ప్రాంతాలు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో అధిక జనాభాకు చైనా, భారత్ లే కారణమని తెలిపింది. ఈ రెండు దేశాల జనాభా 1.4 బిలియన్లకు పైగానే ఉంటుందని అంచనా వేసింది. 2050 నాటికి ప్రపంచ జనాభా పెరుగుదల 8 దేశాలల్లో ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అందులో భారత్, పాకిస్తాన్, కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, నైజీరియా, ఫిలిఫ్పీన్స్ , టాంజానీయా ఉన్నాయి. అంతేకాదు జననాల రేటుతోపాటు మరణాల రేటు కూడా గణనీయంగానే పెరిగింది. ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం పేద దేశాల్లోనే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. ఇందులో ఆఫ్రీకాలోని చాలా దేశాలు ఉన్నాయి.