Site icon HashtagU Telugu

International Biodiversity Day: నేడు…అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం..!!

Biodiversity

Biodiversity

మే 22..నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం. ప్రతిఏటా మే 22న జరుపుకుంటారు.భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవివైవిధ్యం అంటారు. 2010ని అంతర్జాతీయ జీవవైవిధ్య సంత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల పలు జాతులు జీవనవైవిధ్యం 3..5 బిలియన్ సంవత్సరాల పరిణామ క్రమం. మన జీవనశైలి కారణంగా పర్యావరణంలో ఎన్నోమార్పులు, కాలుష్యం పెరిగి భూగోళం వేడెక్కి జీవవైవిధ్యం దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలోని 12మహా జీవవైవిధ్య ప్రాంతాల్లో ఒకటిగా పేరొందిన ఇండియాలో సుమారు 45వేల వ్రుక్షజాతులు, 77వేల జంతు జాతులు ఉండేవి. అవన్నీ క్రమంగా 10శాతానికిపైగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అంతేకాదు గత మూడు దశాబద్ధాలలో 50శాతానిపైగా అరణ్యాలు, 70శాతానికి పైగా నీటి వరనరులు కనుమరుగయ్యాయి. అలాగే ఈ మధ్యే జన్యుమార్పిడి కూడా జీవివైవిధ్యాన్ని భారీగా దెబ్బతీస్తోందంటున్న పరిశోధకులు..ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా 10వేల జాతుల జీవరాశులు అంతరించిపోయాయని…అవి అంతరిస్తే మానవ మనుగడకు ప్రమాదకరమని హెచ్చరిస్తూ…మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిస్తున్నారు.