Site icon HashtagU Telugu

Success Story:నాడు ప‌శువుల కాప‌రి.. నేడు జిల్లా క‌లెక్ట‌ర్ గా

Whatsapp Image 2022 01 01 At 21.01.59 Imresizer

Whatsapp Image 2022 01 01 At 21.01.59 Imresizer

క‌ష్ట‌ప‌డితే సాధించ‌లేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ మ‌హిళ‌. పేద‌రికంలో పుట్టిన ఆమె .. త‌న కుటుంబానికి జీవ‌నాధార‌మైన ప‌శువుల‌ను కాస్తూ ఉన్న‌త చ‌దువులు చ‌దివింది. త‌న తండ్రి ట్ర‌క్ డ్రైవ‌ర్ గా.. త‌ల్లి ప‌శుపోష‌ణ చేసుకుంటే ఆమెను చ‌ద‌వించారు.
2015లో తమిళనాడు కు చెందిన వ‌న్మ‌తి సివిల్స్ టాప‌ర్ గా నిలిచిన వ‌న్మ‌తి.. త‌న జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. పశువుల్ని మేపుకుంటూ కలెక్టరుగా ఎదిగిన ఆమె జీవితం సివిల్స్ సాధించేవారికి ఆద‌ర్శం. వ‌న్మ‌తి త‌న హాబీ ఇప్ప‌టికూడా ప‌శువుల‌ను మెప‌డం అని చెబుతుంటారు. చదువుని ఎంతగా ప్రేమిస్తుందో తన ఇంట్లో అమ్మ కష్టాన్నీ అంతే ఆనందంగా వ‌న్మ‌తి పంచుకుంటుంది . పలకా బలపంతో బడికెళ్లినప్పట్నుంచి నుంచి సివిల్స్ రాసే వరకూ చదువూ, గేదెలే ఆమె లోకం. ఇంటికి రాగానే పుస్తకాల సంచీ ప‌క్క‌న‌పెట్టి పశువులను తోలుకొని వెళ్లేది

త‌మిళనాడులోని ఇండోర్ జిల్లా సత్యమంగళంలో పుట్టిన వ‌న్మ‌తికి చిన్నప్పటినుంచి ఐఏఎస్ కావాలనే కోరిక ఉండేది. ఈకోరికే నిరంతరం చదువుని ప్రేమించేలా చేసింది. ఎక్క‌డికి వెళ్లిన ఆమె వెంట ఓ పాఠ్య పుస్త‌కం మాత్రం ఉండేది. ఓ రోజు వాళ్ల కాలేజీకి వచ్చిన జిల్లా కలెక్టరు మాటలూ, ఆదరణ కూడా వన్మతి ఆశలకు మరింత బలం చేకూర్చాయి. తన కాలేజీకొచ్చిన మహిళా కలెక్టరు గారిని చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అంతా గౌరవించడం వన్మతికి గొప్పగా అనిపించింది. ఇది చూసిన ఆమె తను కూడా కలెక్టర్ అవ్వాలని ఆ క్షణమే అనుకుంది. ఎందులోనైనా మంచీ, చెడూ రెండూ ఉంటాయి. కావాల్సిన మంచిని ఎంచుకొని చెడుని వదిలేయాలని వన్మతికి ఆమె తల్లి చెప్పేది. అంతే కాదు తను చూసిన టీవీ సీరియల్ ‘గంగా, జమునా, సరస్వతి’ నుంచి కూడా ఐఏఎస్ కావాలనే స్ఫూర్తి పొందారు వన్మతి.

ఇంటర్ తర్వాత కూడా చదువెందుకూ పశువులు కాసుకోడానికి ఈ చదువు చాలదా అన్నవాళ్లే.. వన్మతి బంధువులు, చుట్టపక్కల వాళ్లూ! వాళ్లతోపాటు ఆడపిల్లలకు పెళ్లే పరమార్థం అని బోధించే వాళ్లు కూడా చివరికి వన్మతి పట్టుదల ముందు వీగిపోయారు. తొలిసారి యూపీఎస్సీ పరీక్షల్లో అపజయంతో పరీక్షలో కష్టాన్ని అంచనా వేసుకుంది వన్మతి. మరింత కష్టపడి చదివింది. రెండోసారి కూడా రాలేదని అధైర్యపడలేదు. అపజయాన్నుంచే ధైర్యాన్ని అందిపుచ్చుకుంది. కసిగా చదివింది. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడింది. మూడోసారి విజయం తనని వెతుక్కుంటూ వచ్చింది. సివిల్స్లో 152 ర్యాంకుతో తమిళనాడు రాష్ట్రానికీ, తన ఊరికీ కీర్తిని తెచ్చిపెట్టింది. వ‌న్మ‌తి ప‌ట్టుద‌ల‌తో త‌న పేద‌రికం సైతం చిన్న‌బోయింది. క‌ష్ట‌ప‌డితే సాధించ‌లేద‌ని ఏదీ లేద‌ని వ‌న్మ‌తి నిరూపించింది.

Exit mobile version