TN Corona:త‌మిళ‌నాడులో స‌న్ డే లాక్ డౌన్‌.. ఆహ్వానం చూపిస్తే ప్ర‌యాణానికి అనుమ‌తి

మిళ‌నాడులో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్య‌క్ర‌మాల‌కు వెళ్లే వారి ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 07:35 PM IST

మిళ‌నాడులో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్య‌క్ర‌మాల‌కు వెళ్లే వారి ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. అయితే దానికి సంబంధించిన ఆహ్వాన ప‌త్రిక‌లను పోలీసుల‌కు చూపించి వెళ్లాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఆహ్వానాలు చూపించిన ప్రయాణికులకు పోలీసులు తమ పూర్తి సహకారాన్ని అందిస్తారని తెలిపింది.

కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరగడంతో పాటు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఎక్కువ‌గా న‌మోద‌వ్వ‌డంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుండి రాత్రి కర్ఫ్యూను ప్రవేశపెట్టింది. దీంతో పాటు ఆదివారం పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. వివాహ కార్యక్రమాలకు 100 మందిని మాత్రమే అనుమతించాలని ఆంక్షలు చెబుతున్నాయి. ఆదివారం లాక్‌డౌన్ సమయంలో ఫుడ్ డెలివరీ సేవలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెస్టారెంట్‌లను అనుమతించింది.

నగరంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన వండలూరులోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ ఆదివారం మూసివేయబ‌డింది. జనవరి 11న ఇది తిరిగి తెరుచుకుంటుంద‌ని జూ అధికారులు తెలిపారు. ఇదిలావుండగా పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి సమావేశాలు, వారానికోసారి నిర్వహించే రైతుల ఫిర్యాదుల సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల విషయానికొస్తే 1-9 తరగతులకు మాత్రమే ఆన్‌లైన్ తరగతులు నిర్వ‌హిస్తున్నారు. అయితే 10, 11, 12 తరగతులకు మాత్రమే స్కూల్స్ లో త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు. మెడికల్ , పారామెడికల్ కాలేజీలు మినహా అన్ని కళాశాలలు జనవరి 20 వరకు మూసివేయబడ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.