Site icon HashtagU Telugu

TN: ఫిబ్రవరి 8న తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

tamil nadu assembly

tamil nadu assembly

నీట్‌కు వ్యతిరేకంగా బిల్లును గవర్నర్ ఆర్‌.ఎన్ ర‌వి వాపస్ చేయడంపై చర్చించేందుకు ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావు తెలిపారు. సెయింట్‌ జార్జ్‌ ఫోర్ట్‌లోని శాసనసభ హాలులో సభ జరగనుందని ఆయన చెప్పారు. శనివారం నాటి సమావేశాన్ని అన్నాడీఎంకే బహిష్కరించినప్పటికీ ప్రత్యేక సమావేశానికి హాజరవుతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు ఫిబ్రవరి 19న జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అడ్డంకి కాబోవని సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అంతకుముందు, అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చేస్తూ, నీట్ పేద, మధ్య తరగతి విద్యార్థులను ప్రభావితం చేయడమే కాకుండా మెడికల్ కాలేజీలలో విద్యార్థులను చేర్చుకునే హక్కును రాష్ట్ర ప్రభుత్వాలకు దూరం చేసిందని అన్నారు. ప్రత్యేక కోచింగ్ తరగతులకు హాజరు కావడానికి NEET అనుకూలతను కలిగి ఉన్నందున‌…పాఠశాల విద్య యొక్క ఔచిత్యాన్ని బలహీనపరుస్తుంది కాబట్టి నీట్ ని రద్దు చేయడానికి బిల్లు ఆమోదించబడిందన్నారు.

Exit mobile version