Site icon HashtagU Telugu

Smuggle Rare Animals : అరుదైన జంతువుల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ముగ్గురు అరెస్ట్‌

Dri Imresizer

Dri Imresizer

అరుదైన జంతువులను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ముగ్గురిని బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు బ్యాంకాక్‌ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ముగ్గురు ప్రయాణికుల లగేజీని తనిఖీ చేసిన తర్వాత జనవరి 22న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. ప‌క్కా స‌మాచారంతో డీఆర్ఐ అధికారులు ఆ ముగ్గురు ల‌గేజీని చెక్ చేశారు. ల‌గేజీలో అరుదైన జంతువుల‌ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ప్రయాణికులు అక్రమ రవాణాకు ప్రయత్నించిన జంతువులను కస్టమ్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటక అటవీ శాఖ అధికారుల సహాయంతో.. బెంగళూరులోని ఒక ఫామ్‌హౌస్ నుండి 34 CITES-జాబిత జాతులతో సహా 48 విభిన్న జాతులకు చెందిన మరో 139 జంతువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా స్థానికేతర వన్యప్రాణులను సేకరించేందుకు ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు వెల్లడైంది. చాలా అరుదైన పసుపు, ఆకుపచ్చ అనకొండ, ముసుగు ఊసరవెల్లి మొదలైన వాటితో సహా కొన్ని జంతువులను బన్నెరఘట్ట బయోలాజికల్ పార్కుకు అప్పగించారు. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు.