Site icon HashtagU Telugu

Cyclone Jawad Update: ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..అప్ర‌మ‌త్త‌మైన యంత్రాంగం

Jawad

Jawad

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీల దూరంలో.. ఒడిశా గోపాల్‌పూర్‌కు 530 కి.మీల దూరంలో జవాద్ తుపాను కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. గంటకు 25 కి.మీల వేగంతో తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుందని, అలా వచ్చే కొద్దీ దిశ మార్చుకొని పూరీ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తా తీరంలో 80 నుంచి 90 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల 20 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. తుపాను వల్ల 3.5మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రలో అన్ని పోర్టులకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు

జావద్ తుఫానుపై జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయిందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ తెలిపారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమై జావద్ తుఫాన్ తీరం దాటే సమయంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమిత్ బర్ధార్ సూచించారు. జల్లాలోని ఇప్పటికీ సుమారు 239 తుఫాన్ ప్రభావిత తీరప్రాంత గ్రామాల‌ను గుర్తించామ‌ని ఆయా గ్రామాలకు ప్రత్యేక అధికారులును నియమించామ‌ని ఎస్పీ తెలిపారు.

Also Read : పీకే `50-50` గ్రాఫ్

తీరా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు 3 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలతో పాటు, రాష్ట్ర విపత్తు ప్రతి దళాలు చేరుకున్నాయ‌ని ఎస్పీ తెలిపారు.తుఫాన్ ప్రభావం ద్వారా నేలకురిగిన వృక్షాలు,చెట్లను సకాలంలో తొలిగించి రహదారి మార్గంలో రవాణాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని జాతీయ,రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళ సిబ్బందికి సన్నద్ధం చేశామని అన్నారు.

Officials preparing for the cyclone

తుఫాను సమయంలో జిల్లా రెవిన్యూ పోలీసు ఇతర విభాగాల యంత్రాంగలు సమన్వయం చేసుకుంటూ ముందస్తుగా అన్ని విధాలా సహాయక చర్యలు తీసుకుంటామని తెలిపారు.తుఫాను హెచ్చరిక దృష్ట్యా శనివారం భారీ వర్ష సూచన ఉందని….తుఫాన్ తీరం దాటే సమయంలో బయట ప్రదేశాల్లో ప్రజలు ఎవరు ఉండకుండదుని ప్రజలకు సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఉండ‌కూద‌డ‌ని…పునరావాస కేంద్రాల్లో మాత్రమే ఉండాలని కోరారు. అదేవిదంగా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కోరారు.పశు సంపదనకు ఎటువంటి హానీ జరగకుండా సురక్ష ప్రదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్దం చేసిమన్నారు.భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నందున మడ్డువలస డ్యామ్ లో నీటిమట్టాన్ని కొంతమేరకు తగ్గించామ‌ని ఎస్పీ తెలిపారు.

Also Read: తెలంగాణ‌లో ఒమైక్రాన్ టెన్ష‌న్‌… ఓ మ‌హిళ‌కు పాజిటివ్‌…?

Exit mobile version