గుగూల్ జాబ్ కు బై..ప‌ర్యావ‌ర‌ణానికి జై.. ఆద‌ర్శ మూర్తి..గురుమూర్తి.

గుగూల్ కంపెనీలో జాబ్ వ‌స్తే వ‌దులుకుంటారా? మంచి ప్యాకేజీ, టైం టూ టైం ఆఫీస్‌..ఇంకేం కావాలి. గుగూల్ కంపెనీలో జాబ్ రావ‌డ‌మే అదృష్టంగా భావిస్తుంటారు నేటి యువ‌త‌.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:36 PM IST

గుగూల్ కంపెనీలో జాబ్ వ‌స్తే వ‌దులుకుంటారా? మంచి ప్యాకేజీ, టైం టూ టైం ఆఫీస్‌..ఇంకేం కావాలి. గుగూల్ కంపెనీలో జాబ్ రావ‌డ‌మే అదృష్టంగా భావిస్తుంటారు నేటి యువ‌త‌. అలాంటిది ఆ జాబ్ ను వ‌దిలేసి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం బ‌య‌ట‌కొచ్చే వాళ్లు ఉంటారా? స్వ‌చ్చంధంగా న‌దులు, స‌ర‌స్సుల‌ను బాగు చేసేందుకు గుగూల్ కంపెనీను వ‌ద‌లుకుంటారా? చాలా మంది ఈజీగా గుగూల్ కంపెనీలో ఉద్యోగం వ‌దులుకోరు. కానీ, హైద్రాబాద్ గుగూల్ కంపెనీలో ప‌ని చేసే అరుణ్ గురుమూర్తి జాబ్ ను వ‌దిలేశాడు. తాను లేక‌పోయిన‌ప్ప‌టికీ గుగూల్ కంపెనీ న‌డుస్తుంది. కానీ, నెల‌కొల్పిన ఎన్విరాన్మెంట‌లిస్ట్ పౌండేష‌న్ ఆఫ్ ఇండియా..ఈఎఫ్ ఐ న‌డ‌వాలంటే తన అవ‌స‌రం ఉంద‌ని మూర్తి భావించాడు. అందుకే గుగూల్ కంపెనీకి గుడ్ బై చెప్పాడు. న‌దులు, స‌ర‌స్సుల‌ను బాగు చేసే బాధ్య‌త‌ను తీసుకున్నాడు.

ఆధునిక యుగంలో న‌గ‌రీక‌ర‌ణ అనూహ్యంగా పెరుగుతోంది. ఆ క్ర‌మంలో న‌దులు, స‌రస్సులను పూడ్చి వేస్తున్నారు. కొన్ని చోట్ల ధ్వంసం చేస్తున్నారు. ఫ‌లితంగా భూ గ‌ర్భ జ‌ల మ‌ట్టం త‌గ్గిపోతోంది. స‌రస్సులు, న‌దుల ప్ర‌వాహం నిలిచిపోతోంది. ఇలా కావ‌డానికి మాన‌వ నిర్ల‌క్ష్యం కార‌ణమ‌ని గురుమూర్తి అభిప్రాయం.

కొన్ని ద‌శాబ్దాలు యూఎన్ వో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా న‌దులు, స‌ర‌స్సుల‌ను పున‌రుద్ధ‌రించ‌డం, ప‌ర్యావ‌ర‌న స‌మ‌తుల్య‌త‌ను కాపాడే ల‌క్ష్యాల‌ను పెట్టుకుంటోంది. ఇటీవ‌ల ప‌ర్యావ‌ర‌న ప‌రిర‌క్ష‌ణ కోసం ప‌లు స్వ‌చ్చంధ సంస్థ‌లు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వేత్త‌లు ముందుకొచ్చారు. వాళ్లంద‌రి కంటే గురుమూర్తి పెట్టిన ఈఎఫ్ఐ ముందు వ‌రుస‌లో ఉంది. సుమారు 14 రాష్ట్రాల‌లో ఈ సంస్థ ప‌నిచేస్తోంది. త‌మిళ‌నాడు, ఢిల్లీ, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్యావ‌ర‌ణం కాపాడేందుకు స‌ర‌స్సులు, న‌దుల‌ను పున‌రుద్ద‌రించింది. జానీ గుడాల్ ఇనిస్టిట్యూట్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌క‌టించే గ్లోబ‌ల్ యూత్ లీడ‌ర్ షిప్ అవార్డును 2010లో గురుమూర్తి అందుకున్నారు. ఇదంతా న‌దులు, స‌రస్సులు, సంప్ర‌దాయాలు, నాగ‌రిక‌త‌పై త‌న‌కున్న ఇష్టం కార‌ణంగా సాధ్యం అయింద‌ని మూర్తి అంటున్నారు.

ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌డం ఒక మ‌నిషికో, ఒక సంస్థ‌కో ప‌రిమితం కాకూడ‌ద‌ని మూర్తి అభిప్రాయం. ప్ర‌ధానంగా ప‌రిశ్ర‌మల యాజ‌మాన్యాలు, పౌర సంఘాలు, పౌరులు సంయుక్తం ప‌నిచేస్తే ఈజీగా పర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోగ‌ల‌మ‌ని మూర్తి భావ‌న‌. శ్ర‌మ‌దానం వంటి ప‌నులు చేయ‌డానికి ముందుకు రావాలి. న‌దులు, స‌ర‌స్సుల ఒడ్డు మీద చెత్తాచెదారం వేయ‌డం ఆపాలి. వ‌ర్ష‌పునీటిని స‌ర‌స్సులు, న‌దుల్లో పూర్తి స్థాయిలో నింపుకునే ఏర్పాట్లు చేయాలి. ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించాలి..ఇలా అంద‌రూ చేయ‌డానికి ముందుకు వ‌స్తే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ సాధ్యం అవుతుంద‌ని గురుమూర్తి చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా స్వ‌చ్చంధంగా ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు మూర్తి. యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. భావిత‌రాల‌కు స్పూర్తిగా గురుమూర్తి మారాడు. సో..గుగూల్ జాబ్ కంటే ఈఎఫ్ ఐ సేవ‌లు సంతృప్తిని ఇస్తున్నాయ‌ని మూర్తి సంతోష ప‌డుతున్నాడు.