Site icon HashtagU Telugu

Kerala Park: ఇది యూరోప్ కాదు.. కేరళలోని ఓ పార్కు!

Kerala

Kerala

కేరళ గ్రామంలో కొత్తగా నిర్మించిన పార్క్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతుండటంతో చాలామంది దీనిని యూరోపియన్ నగరంతో పోల్చారు. కోజికోడ్ జిల్లాలోని వడకర సమీపంలోని కరక్కాడ్ వద్ద ఉన్న కొత్త వాగ్భటానంద పార్క్ ఫొటోలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ సోషల్ మీడియా లో షేర్ చేశారు. అవి కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి.

పార్కులో విగ్రహాలు, బహిరంగ వేదిక, బ్యాడ్మింటన్ కోర్ట్, ఓపెన్ జిమ్నాసియం, పిల్లల పార్కు ఉన్నాయి. దివ్యాంగులు కూడా ఉండేందుకు వీలుగా మార్గాలు, మరుగుదొడ్లు రూపొందించారు. వీల్‌చైర్‌ల్లో వెళ్లేందుకు పార్కు మోల్డ్ చేసి ఉంటుంది. అంతేకాదు.. దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు సహాయపడే స్పర్శ టైల్స్ కూడా ఉన్నాయి.