స్మగ్లర్ వీరప్పన్ ను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ భద్రతా సలహాదారు, మాజీ ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్ తన పదవీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సంబంధిత అధికారులకు అందించారు. ఢిల్లీలో తన నివాసాన్ని ఖాళీ చేసి తమిళనాడు వెళ్లిపోయారు. విజయ్ కుమార్ అనూహ్యంగా రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యక్తిగత కారణాలతోనే తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా విజయ్ కుమార్ జమ్మూ కశ్మీర్ సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. 1975బ్యాచ్ కుచెందిన ఐపీఎస్ అధికారి. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ గా 2012లో పదవీ విరమణ చేశారు. వీరప్పన్ ను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చీఫ్ గా పనిచేశారు విజయ్ కుమార్. ఆయన అమలు చేసిన ప్లాన్ లో చిక్కుకుని వీరప్పన్ మరణించిన వార్త అప్పల్లో సంచలనం క్రియేట్ చేసింది. ఆతర్వాత కీలక బాధ్యతలు నిర్వహించిన విజయ్ కుమార్…ఇప్పుడు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయంగా మారింది.