Crime : సరదాగా పందెం కాసి మైనర్ బాలికపై అత్యాచారం.. వీడియో తీసి పైశాచిక ఆనందం..!!

జార్ఖండ్ లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికకు తానే నిజమైన ప్రేమికుడిగా నిరూపించుకునేందుకు ఓ యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 01:23 PM IST

జార్ఖండ్ లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికకు తానే నిజమైన ప్రేమికుడిగా నిరూపించుకునేందుకు ఓ యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాదు ఆ ఘటనను వీడియో తీసి  వైరల్ చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అల్కదిహాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నిందితుడు సంజయ్ భూయాన్ శనివారం రాత్రి ఈ ఘటనకు పాల్పడ్డాడు అని చెప్పారు. తన పక్కింట్లో ఉంటున్న 16 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం చేశాడు. అత్యాచారానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన స్నేహితులతో పందెం కాసి..ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. బాధితురాలి బంధువులు అల్కదిహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… పోక్సో చట్టం కింద కేసు నమోదు జైలుకు తరలించారు.