Site icon HashtagU Telugu

Thalapathy Vijay : అక్టోబర్‌ 27 న ‘మహానాడు’ సభ ఏర్పాటు చేయబోతున్న విజయ్

Thalapathy Vijay

Thalapathy Vijay

సినీనటుడు విజయ్‌(Actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(TVK) తొలి మహానాడు (Mahanadu) అక్టోబర్‌ 27 న నిర్వహించబోతున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు , అభిమానులకు , నేతలకు ఆహ్వానం పంపించారు. ముందుగా ఈ నెల 23న విక్రవాండిలో ఈ మహానాడును నిర్వహించాలని అనుకున్నారు కానీ పోలీసుల అనుమతి లభించకపోవడం తో వాయిదా వేశారు. ఈ సమావేశంలోనే పార్టీ సిద్ధాంతాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజయ్ కోరారు. కాగా, ఇప్పటికే తమిళగ వెట్రి కళగం పేరుతో అట్టహాసంగా రాజకీయ పార్టీని ప్రారంభించి రాజకీయ ప్రవేశం చేసిన విజయ్‌ ఆగస్టు 22న పార్టీ పతాకాన్ని కూడా పరిచయం చేశారు.

ప్రస్తుతం తన చివరి చిత్రాన్ని రీసెంట్ ప్రకటించారు. విజయ్ కెరీర్‌లో ఇది 69వ చిత్రం. హెచ్ వినోథ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ని కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌లో టార్చ్ బేర‌ర్ ప‌ట్టుకున్న ఓ వ్య‌క్తి చేయి క‌నిపిస్తోంది. ప్ర‌జాస్వామ్యానికి అత‌డో టార్చ్ బేర‌ర్ అంటూ ప్రీ లుక్ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ ఆసక్తిని పెంచింది. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హెచ్ వినోద్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు అర్ధం అవుతుంది.

Read Also : QR code : ఇక పై తెలంగాణ ఆర్‌టీసీ బస్సుల్లో క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులు