Site icon HashtagU Telugu

Rameswaram temple: రామేశ్వరం ఆలయానికి ఉగ్రవాద ముప్పు

Cropped (3)

Cropped (3)

చెన్నైలోని రామేశ్వరం రామనాథ స్వామి ఆలయానికి ఉగ్రవాద బెదిరింపులు కలకలం రేపాయి. ఈ మేరకు కేంద్ర ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో ఆలయ ఉత్తర, దక్షిణ పడమర వీధుల్లో వాహనాల రాకపోకలను పోలీసులు నిషేధించారు. సమీప ప్రాంతాల్లో గస్తీ తీవ్రం చేశారు. ఇటీవల ఆలయ నిషేధిత ప్రాంతాల్లో పలువురు సంచరించడం సహా తమ సెల్ ఫోన్ లో ఆలయ రాజగోపురం, పరిసర ప్రాంతాలను ఫోటోలు తీశారనే ఫిర్యాదుతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి తీవ్రవాద ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా విభాగం సమాచారం. దీంతో ఆలయ ఉత్తర, దక్షిణ, తూర్పు మార్గాల్లో వాహనాల రాకపోకలను నిషేధించి పోలీసులు నిఘాను నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఆలయంలోని నిషేధిత ప్రాంతాల్లో పలువురు అనుమానిత వ్యక్తులు సంచరించడంతో పాటు వారు తమ సెల్ ఫోన్లతో గర్భగుడికి సంబంధించిన కొన్ని ఫోటోలను తీశారనే ఫిర్యాదుతో ఆలయానికి భద్రతను కట్టుదిట్టం చేసినట్టుగా పోలీస్ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు.. దీనిని అడ్డుకోవాల్సిన పోలీసులు, ఆలయ పాలకవర్గం సిబ్బంది కొరతతో పట్టించుకోవడం లేదని ఆధ్యాత్మికవేత్తలు తెలిపారు. గతంలో 2015వ సంవత్సరంలో కూడా రామేశ్వరం ఆలయానికి ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి ఈ ఆలయానికి ఉగ్రవాద బెదిరింపులు రావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.