కర్నాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే తెలంగాణలోని అనాధ శరణాలయాలను సందర్శించి ఇక్కడి పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసిందని, తెలంగాణలో అనాధ శరణాలయాలు స్ఫూర్తివంతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న విధానాలనే కర్ణాటకలో అమలుచేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని తెలిపారు.
అనాధలకు కుల ధ్రువీకరణ పత్రాలు అందడం లేదని, అనాథలను ప్రత్యేక కేటగిరిగా భావించాలని హెగ్డే భావించారు. అనాథలైన 16 సంవత్సరాల లోపు పిల్లలపై సర్వే నిర్వహించి వారికి చేపట్టాల్సిన వసతులపై అధ్యయనం చేస్తామని ఆయన తెలిపారు.
పలువురు అధికారులతో కలిసి అధ్యయనం చేయడానికి వచ్చిన హెగ్డే బృందం పంచమసాలి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న స్థావరాలపై అధ్యయనం చేసింది. ఆ సామజిక వర్గం ఎదుర్కొంటున్న వివక్ష, వారిలోని విద్య, ఉద్యోగ అవకాశాలు మొదలైన వివరాలు సేకరించనున్నారు.
ఒక వర్గం ప్రజలకు ఏయే సౌకర్యాలు కల్పించాలో అనే అవగాహన రావాలంటే ఆయా వర్గాలు పొందుతున్న సౌకర్యాలు ఏంటో తెలుసుకోవాలని అప్పుడే ఏయే సమస్యలు ఉన్నాయి. వేటిల్లో వెనకబడి ఉన్నారు. వాటిని ఎలా మెరుగుపర్చాలనే అంశంపై క్లారిటీ వస్తుందని హెగ్డే తెలిపారు.