Covid 19: తెలంగాణాలో నో కరోనా చావులు

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 679720 చేరింది. అయితే చాల రోజుల తర్వాత సోమవారం రోజు కరోనాతో ఎవరు చనిపోలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Covid Tests

Covid Tests

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 679720 చేరింది. అయితే చాల రోజుల తర్వాత సోమవారం రోజు కరోనాతో ఎవరు చనిపోలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 53, మేడ్చల్ మల్కాజ్గిరి లో 22, రంగారెడ్డిలో 14, సిద్దిపేటలో 12, ఖమ్మంలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలు స్వీయ రక్షణ పాటించాలని వైద్యులు చెపుతున్నారు.

విదేశాల నుండి ఇండియాకి వచ్చిన ప్రయాణికులకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కరోనా టెస్టులు నిర్వహించగా వారిలో 8 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెనింగ్ పరిశోధన కోసం ల్యాబ్ కి పంపారు. ఓమిక్రాన్ కేసులను క్లాసిఫై చేయడానికి నమూనాలను జీనోమ్ సెంటర్ కి పంపామని, అక్కడి నుండి మొత్తం 15 మంది రిపోర్ట్స్ రావాల్సిఉందని అధికారులు తెలిపారు.

  Last Updated: 21 Dec 2021, 12:11 AM IST