Site icon HashtagU Telugu

Tamilnadu: బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులు విసిరిన దుండగులు..!!

తమిళనాడులోని కోయంబత్తూరు బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కార్యాలయంపై పెట్రోలు బాంబులు విసిరారు.దీంతో అక్కడ భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీకేకే మీనన్ రోడ్డులో కొందరు అనుమానాస్పద వ్యక్తులు రెక్కింగ్ నిర్వహించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

కాగా డీఎంకే ఎంపీ ఏ రాజాపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్‌రామస్వామిపై తమిళనాడు పోలీసులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇటీవల డీఎంకే ఎంపీపై ఉత్తమ్‌రామస్వామి కించపరిచే వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆయనను బుధవారం అరెస్టు చేశారు. హిందూ మతంపై ఏ రాజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సెప్టెంబర్ 26న పార్టీ రాష్ట్ర శాఖ నిరసన కవాతు నిర్వహించనన్నట్లు తెలిపింది. పార్టీ కార్యకర్తలనుఅరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ప్రదర్శన చేపడతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఒక ప్రకటనలో తెలిపారు.

Exit mobile version