Site icon HashtagU Telugu

Jai Ravana : దేశం మొత్తం రామస్మరణ చేస్తుంటే.. తమిళనాడులో మాత్రం రావణ జపం..ఎందుకు..?

Jairavana Trend

Jairavana Trend

సుమారు 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరిందని.. దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ముగిసిందని…చిన్న కుటీరంలో ఉన్న శ్రీ రాముడు ఈరోజు ఆలయంలోకి వచ్చారని హిందువులంతా సంబరాలు చేసుకుంటూ జై శ్రీ రామ్..అంటూ రామ స్మరణ చేస్తుంటుంటే..తమిళనాడు లో మాత్రం రావణ జపం చేస్తున్నారు. ఇప్పుడే అక్కడి సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతుంది. ఎందుకు ఇలా ట్రెండ్ అవుతుంది..?

ముఖ్యంగా తమిళులకు మొదటి నుంచి ఉత్తరాది రాష్ట్రాల వారు అంటే ఇష్టం ఉండదు. ద్రవిడులు, ఆర్యులు అనే రెండు సమూహాలు తూర్పు ఆఫ్రికా నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడ్డారని చెబుతారు. ద్రవిడులు భారత ఉపఖండానికి చెందివారు. తమిళం మాట్లాడేవారు. ఇక ఆర్యులు ఉత్తర భారతదేశానికి చెందిన వారు.. వీళ్ళు సంస్కృతం మాట్లాడతారు అనే వాదన ఉంది. రాముడు అంటే కేవలం ఉత్తరాది దేవుడు అనే ఒక బలమైన భావనను వారిలో ఉంది. అంతే కాకుండా రాముడి ప్రవర్తన కంటే రావణుడి ప్రవర్తన చాలా ఉత్తమం అని వారు నమ్ముతారు. రావణుడు పెర్ఫెక్ట్ కాకపోయినా.. రాజుగా.. తమిళులని పరిపాలించిన తెలివైన రాజుగా అతన్ని గౌరవిస్తారు. హిందువులు, బ్రాహ్మణ సమూహాలు క్రియేట్ చేసిన శాస్త్రాలకు బానిసగా ఉన్న వ్యక్తికి ఆలయాన్ని కట్టడాన్ని రావణుడు ప్రతిఘటించాడని తమిళులు నమ్ముతారు. ఈ కారణాలతో కొంతమంది రావణాసురుడిని ఇష్టపడతారు.

We’re now on WhatsApp. Click to Join.

మరికొంతమంది ..తమిళులు రావణుడి సోదరి సెంటిమెంట్ ని ఇష్టపడతారు. సీతను అపహరించిన తర్వాత లంకలో ఆమె పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడని.. అందుకే అతనంటే ఇష్టం అని అంటారు. చచ్చే వరకూ పోరాటం ఆపని యోధుడు కాబట్టి రావణుడు అంటే ఇష్టమని నమ్ముతారు. సీత మీద చేయి వేయలేదు కాబట్టి రావణుడు గొప్పవాడు అని అంటుంటారు.. అసలు పరాయి వ్యక్తి భార్యను ఎత్తుకెళ్ళడాన్ని ఎలా సమర్థిస్తారు.. ఈ విషయంలో రావణుడు మంచివాడు ఎలా అవుతాడు అన్న ప్రశ్నలు వస్తాయి. కానీ వీటికి సమాధానం ఉండదు. ఇక శ్రీలంకతో పాటు.. దానికి సమీపంగా ఉన్న తమిళనాడు కూడా రావణుడి రాజ్యంలో భాగమే అని భావిస్తారు. ఇలా కొంతమంది రావణాసురుడ్ని ఇష్టపడే వారే ఇప్పుడు సోషల్ మీడియా లో రావణ జపం చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఎవరి నమ్మకం వారిది..ఎవరి అభిమానం వారిది..ఇందులో ఎవర్ని తప్పు పట్టలేం..ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి కాకపోతే ఇప్పుడు దేశ వ్యాప్తంగా రామస్మరణ చేస్తున్న క్రమంలో జై రావణ అంటూ ట్రెండ్ చేయడం తప్పు అంటున్నారు హిందూ సంఘాలు. ఇది ఓ విధంగా రెచ్చగొట్టే అంశం అవుతుంది తప్ప మరోటి కాదని..ఇలాంటివి చేయకూడదని వారు సూచిస్తున్నారు.

Read Also : Ram Lalla : ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలి- ప్రధాని మోడీ పిలుపు