Site icon HashtagU Telugu

Vijay Political Party : రాజకీయ పార్టీ ప్రకటించిన సూపర్ స్టార్ విజయ్

Vijay Political Party

Vijay Political Party

Vijay Political Party : సూపర్ స్టార్ విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆయన పార్టీ పేరు తమిళ వెట్రి కజగం (TVK). దీని అర్థం ‘‘తమిళనాడు విజయ పార్టీ’’!! 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేసే అవకాశముంది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన TVK  పార్టీ జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాల్లో నిర్ణయించినట్లుగా లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ‘‘రాజకీయ పార్టీని ప్రకటించినప్పటికీ.. నేను ఇప్పటికే కమిట్ అయి ఉన్న సినిమాలను కూడా తప్పకుండా పూర్తి చేస్తాను. రాజకీయ పార్టీ పనితో సంబంధం లేకుండా సినిమాల వర్క్‌ను కూడా కంప్లీట్ చేస్తాను. ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లో పూర్తిగా పాల్గొనాలని నేను నిర్ణయించుకున్నాను. తమిళనాడు ప్రజలకు నేను తెలుపబోతున్న కృతజ్ఞత ఇదేనని భావిస్తున్నాను’’ అని విజయ్(Vijay Political Party) తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

ఇప్పటివరకు 68 సినిమాల్లో నటించిన విజయ్ ..  రాజకీయాల్లోకి వస్తారని గత దశాబ్దకాలంగా చర్చ జరుగుతోంది.  మరోవైపు ఆయన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు.  ఆహార ఉచిత పంపిణీ, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, లైబ్రరీల ఏర్పాటు, పేద పిల్లలకు సాయంత్రం ట్యూషన్‌కు ఏర్పాట్లు, పేదలకు న్యాయ సహాయం వంటివన్నీ విజయ్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తూ వస్తున్నారు. ఆయనకు తమిళనాడువ్యాప్తంగా అభిమాన సంఘాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి.

Also Read : 18th Century Lemon : మురిగిపోయిన నిమ్మకాయ.. లక్షన్నరకు వేలం.. ఎందుకు ?

నియోజకవర్గ స్థాయిలో పబ్లిక్‌ పరీక్షల్లో టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులకు ఇటీవల హీరో విజయ్ సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ‘‘అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి నాయకుల గురించి చదవండి. దాని నుంచి ఏది మంచిదో అది తీసుకోండి.. మిగిలిన వాటిని వదిలివేయండి’’ అని ఆయన విద్యార్థులకు చెబుతూ వస్తున్నారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ ప్రముఖ సినీ దర్శకుడు. విజయ్ సినిమాలు తరచుగా సున్నితమైన, కీలకమైన ప్రజా ప్రయోజన అంశాలను తాకుతూ ఉంటాయి. అందుకే తమిళనాడులో విజయ్‌కు యూత్‌లో బలమైన ఫాలోయింగ్ ఉంది. సినీ హీరోలు రాజకీయాల్లోకి రావడం తమిళనాడులో కొత్త విషయమేం కాదు. అంతకుముందు కమలహాసన్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. దాని కంటే ముందు రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే టాక్ వినిపించింది. కానీ ఆయన అకస్మాత్తుగా ఆ ఆలోచనను విరమించుకున్నారు.

Also Read : Door To Door Survey : అభయహస్తం అప్లికేషన్లపై డోర్ టు డోర్ సర్వే.. ఇవి రెడీ చేసుకోండి