Site icon HashtagU Telugu

Tamil Nadu : దీపావళి బోనస్ గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ గిఫ్ట్ ..

Diwali Bonus Royal Enfield

Diwali Bonus Royal Enfield

హర్యానా (Haryana ) లో ఓ కంపెనీ యజమాని ఏకంగా తమ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ గా కార్లను అందజేసి వార్తల్లో నిలిస్తే..తాజాగా తమిళనాడు లో ఓ సంస్థ యజమాని తమ ఉద్యోగులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ను గిఫ్ట్ గా వార్తల్లో నిలిచారు. నీలగిరి జిల్లా కోటగిరి (Kotagiri) ప్రాంతంలో శివకుమార్‌ (Shivakumar) ఓ టీ ఎస్టేట్ ఉంది. ఈ క్రమంలో దీపావళి కానుకగా తన ఉద్యోగులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ (Royal Enfield Bikes) ను దీపావళి గిఫ్ట్ గా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అంతే ఏమాత్రం ఖర్చు కు ఆలోచించకుండా బైక్ లను గిప్ట్ లుగా ఇచ్చేసాడు. బైక్స్ అందుకున్న వారిలో మేనేజర్ నుంచి డ్రైవర్ వరకు అన్ని స్థాయిల సిబ్బంది ఉన్నారు.

శివకుమార్ .. కోటగిరి ప్రాంతంలో 20 ఏళ్లకు పైగా స్థిరపడ్డాడు. ఇక్కడ, అతను ఒక ఎస్టేట్ కొన్నాడు. ప్రతి సంవత్సరం దీపావళికి ఏదో ఒక స్పెషల్ ప్లాన్ చేసి తన ఉద్యోగులకు బహుమతులు అందించడం శివకుమార్ కు అలవాటు. ఈసారి వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను బహుమతిగా ఇచ్చి వారిని సంతోషం లో పడేసాడు. ఈ బహుమతితో ఆశ్చర్యానికి గురైన ఉద్యోగులు చాలా సంతోషంగా ఉందన్నారు. ఏడాది పొడవునా కష్టపడి పనిచేసే ఉద్యోగులను ఎప్పటికప్పుడు ఆదుకుంటామని, వారికి వసతి, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వారి పిల్లల చదువుకు అయ్యే ఖర్చును మా సంస్థ భరిస్తుందని శివకుమార్‌ చెప్పుకొచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా అంటే హర్యానా.. పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని (Haryana Pharma Company Owner) ఎంకే భాటియా తన ఉద్యోగులను సెలబ్రిటీలుగా పేర్కొంటూ.. 12 మంది స్టార్ పెర్ఫార్మర్స్‌కి (12 ‘star’ Employees) కార్లను (Cars Gift) బహూకరించాడు. ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్ హెల్త్ కేర్, సమీప భవిష్యత్తులో మరో 38 మంది ఉద్యోగులకు కార్లను అందించాలని యోచిస్తోంది. ఈ దీపావళి బహుమతి అందుకున్న వారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉండడం విశేషం. తన కంపెనీ విజయానికి ఉద్యోగుల కఠిన శ్రమ, అంకితభావం, విధేయత కారణమని పేర్కొన్నారు. వీరిలో కొందరు కంపెనీ ప్రారంభం నుంచి ఆయన వెంటే ఉన్నారు. ఈ కార్లు కేవలం దీపావళి కానుకలే కాదని, కంపెనీపై వారికి ఉన్న అచంచలమైన నిబద్ధత, విశ్వాసానికి రివార్డులని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గిఫ్టుగా కారు అందుకున్న వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా రాదట. ఇలాంటి గిఫ్టులను తాము కలలో కూడా ఊహించలేదని ఉద్యోగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Read Also : Telangana : కేసీఆర్ ఫై ప్రశంసలు కురిపించిన ఎంపీ అర్వింద్‌