Corona: తమిళ‌నాడులో పెరుగుతున్న క‌రోనా కేసులు.. రోజు 30వేల‌కు పైగానే..!

త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 30 వేల మార్క్ కి చేరుతుంది. దీంతో జ‌న‌వ‌రి 23(ఆదివారం) పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ని ప్ర‌భుత్వం విధించింది.

  • Written By:
  • Publish Date - January 24, 2022 / 06:15 AM IST

త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 30 వేల మార్క్ కి చేరుతుంది. దీంతో జ‌న‌వ‌రి 23(ఆదివారం) పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ని ప్ర‌భుత్వం విధించింది. ఫుడ్‌ డెలివరీతో సహా అవసరమైన సేవలలో పాల్గొనే వ్యాపారాలకు మాత్రమే ఈ పరిమితుల నుండి మినహాయింపు ఇచ్చారు. జనవరి 22 న రాష్ట్రం మొత్తం 30,744 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైయ్యాయి.

చెన్నైలో 6,452, కోయంబత్తూరులో 3,886, చెంగల్పట్టులో 2,377 కొత్త కేసులు నమోదయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూను జనవరి 31 వరకు పొడిగించాలని నిర్ణయించింది. 1-12 తరగతుల విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ప్ర‌స్తుతం ఆన్‌లైన్ తరగతులను మాత్రమే అనుమతిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.ఆదివారం లాక్ డౌన్ వ‌ల్ల కొంత కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు వైద్యులు అంటున్నారు.