Site icon HashtagU Telugu

Rains : తమిళనాడులో భారీ వర్షాలు..చెన్నై సహా 27జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!!

Rains

Rains

తమిళనాడును భారీ వర్షాలు వదలడం లేదు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు 23 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. నవంబర్ 13 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెన్నై సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలకు సెలవు ప్రకటించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో గురువారం రాత్రి నుంచి మొదలైన వర్షం తగ్గడం లేదు. ముఖ్యంగా ఆవడి, పూనమల్లి మధ్యమార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు, వరదలు వంటి విపత్తుల వల్ల ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం, అధికారులు అన్ని విధాల అండగా ఉంటారని ట్వీట్ చేశారు. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటున్న అధికారులకు అభినందనలు తెలిపారు.