Site icon HashtagU Telugu

CSK: చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాన్ చేయాలని డిమాండ్.. కారణమిదే..?

CSK vs RR

CSK vs RR

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్థానిక ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనందుకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై నిషేధం విధించాలని పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌ను తమిళనాడు (Tamil Nadu) జట్టుగా ప్రమోట్ చేశారని, అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఈ జట్టులో లేరని అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎస్పీ వెంకటేశ్వరన్ ఈ జట్టుపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, అయితే CSK ఫ్రాంచైజీ తన 27 మంది సభ్యుల జట్టులో ఒక్క ఆటగాడిని కూడా ఉంచుకోలేదని పిఎంకె సీనియర్ నాయకుడు అసెంబ్లీలో చెప్పారు. తమిళనాడు పేరును వాడుకుని సీఎస్‌కే భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోందని, అయితే అది తమిళనాడు ఆటగాళ్లను పక్కన పెట్టిందని అన్నారు.

అసెంబ్లీలో యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ నిధుల డిమాండ్‌పై జరిగిన చర్చ సందర్భంగా శాసనసభలో ఈ అంశాన్ని లేవనెత్తిన శాసనసభ్యుడు.. “తమిళనాడు జట్టుగా ప్రచారం చేస్తూ మా ప్రజల నుంచి లబ్ధి పొందుతున్నారు” అని అన్నారు. కానీ మన రాష్ట్రం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు అని ఆరోపించారు.

Also Read: MI beats DC: ఎట్టకేలకు ముంబైకి తొలి విజయం.. పోరాడి ఓడిన ఢిల్లీ

గతంలో చెన్నై జట్టుపై రెండేళ్ల నిషేధం

ఫిక్సింగ్‌కు సంబంధించిన కేసులో చెన్నై జట్టుపై రెండేళ్ల నిషేధం పడింది. IPL 2016, 2017లో ఈ జట్టు టోర్నమెంట్‌లో భాగం కాలేదు. చెన్నైతో పాటు రాజస్థాన్ రాయల్స్‌పై కూడా రెండేళ్ల నిషేధం పడింది. ఈ రెండు జట్లను 2016, 2017లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ భర్తీ చేశాయి. అయితే నిషేధం తర్వాత చెన్నై అద్భుతంగా పునరాగమనం చేసి ఛాంపియన్‌గా కూడా అవతరించింది.

Exit mobile version