Tamil Nadu MP: ప్రస్తుతం 18వ లోక్‌సభలో ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా పార్లమెంట్‌లో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సన్నివేశానికి తెలుగువారితోపాటు అక్కడున్న అన్ని రాష్ట్రాల ఎంపీలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికైన ఎంపీలు తెలుగులో ప్రమాణస్వీకారం చేయడానికి తడబడుతున్న వేళ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కృష్ణగిరి నియోజకవర్గం ఎంపీ (Tamil Nadu MP) కే గోపీనాథ్ తెలుగులో ప్రమాణస్వీకారం చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అంతేకాకుండా చివరలో తన ప్రమాణ స్వీకారాన్ని జై తమిళనాడు అనే పదంతో ముగించాడు.
ఎంపీగా ప్రమాణ స్వీకరాం చేయటానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ అక్కడ ఈ విధంగా ప్రమాణం చేశారు. సభకు నమస్కారం కే గోపినాథ్ అనే నేను భారత పార్లమెంట్ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని స్వీరంచబోవు కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నండ్రి వణక్కం జై తమిళనాడు అంటూ ప్రమాణ స్వీకారం చేసి తనకు కేటాయించిన ప్లేస్‌కు వెళ్లారు. ఇలా తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయటంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఎంపీ మాతృభాష తెలుగు అని, అందుకే ఆయన తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారని తెలుస్తోంది. గోపినాథ్ ఎంపికైన క్రిష్ణగిరి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండటం విశేషం. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మంది తెలుగువారు ఉంటారని తెలుస్తోంది. వివిధ కారణాల వల్లన తెలుగువారు ఆ ప్రాంతానికి వెళ్లి స్థిరపడినట్లు తెలుస్తోంది.
Also Read: BMW EV Scooter: త్వరలోనే మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్.. పూర్తి వివరాలివే?
తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికైన ఎంపీలు తెలుగులో ప్రమాణస్వీకారం చేయడానికి తడబడుతున్న వేళ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కృష్ణగిరి నియోజకవర్గ ఎంపీ కే గోపీనాథ్ తెలుగులో ప్రమాణస్వీకారం చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.. pic.twitter.com/M63MPJd5qM
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2024
ఇలా తెలుగులో ప్రమాణం చేసిన కాంగ్రెస్ ఎంపీ ఇంతకుముందు హోసూరులో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి నుంచి కాంగ్రెస్ కూటమి ఎంపీగా పోటీచేసిన భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అసెంబ్లీ సమావేశాల్లో తెలుగులోనే మాట్లాడేవారని సమాచారం. అయితే ఇలా తెలుగులో ఎంపీ ప్రమాణ స్వీకారం చేయడంతో తెలుగు ప్రజలు సైతం ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join