Tamil Nadu: ‘రూపాయి కాయిన్స్’ తో బైక్ కొనుగోలు!

పొదుపు చేసిన ఒక రూపాయి కాయిన్స్ తో డబ్బు చెల్లించి రూ. 2.6 లక్షలతో బైక్‌ను కొనుగోలు చేశాడు ఓ యువకుడు.

Published By: HashtagU Telugu Desk
Bike

Bike

తమిళనాడులోని సేలంకు చెందిన ఓ యూట్యూబర్ గత మూడేళ్లలో తాను పొదుపు చేసిన ఒక రూపాయి కాయిన్స్ తో డబ్బు చెల్లించి రూ. 2.6 లక్షలతో తన కలల బైక్‌ను కొనుగోలు చేశాడు. అతని స్నేహితులు, ఐదుగురు సిబ్బంది చిల్లరను  లెక్కించేందుకు పది గంటల సమయం పట్టిందని షోరూం సిబ్బంది తెలిపారు.

29 ఏళ్ల భూపతి బజాజ్ డామినార్ 400పై ఇష్టం పెంచుకున్నాడు. మూడేళ్ల క్రితం షోరూమ్‌లో ఆరా తీస్తే దాని ధర రూ. 2 లక్షలుగా ఉంది. అప్పుడు అతని వద్ద డబ్బులు లేకపోవడంతో ఇటీవల సంప్రదించగా రూ.2.61 లక్షలకు పెరిగినట్లు గుర్తించారు. దీంతో అతను ఈ డబ్బును పొదుపు చేశాడు. అది కూడా ఒక రూపాయి కాయిన్స్ రూపంలో. డబ్బును వ్యాన్‌లో తీసుకొచ్చి చక్రాల బండిల్లో షోరూమ్‌కు తరలించారు. ఈ సందర్భంగా షోరూమ్ మేనేజర్ మహావిక్రాంత్ మీడియాతో మాట్లాడుతూ… తాను ఒక రూపాయి నాణేలను తీసుకోవడానికి ఇష్టపడలేదని, అయితే ఈ బైక్ కొనడం కోసమే భూపతి వాటిని సేకరించినట్లు గుర్తించామని, అందుకే అంగీకరించామని తెలిపారు.

  Last Updated: 29 Mar 2022, 04:06 PM IST