Site icon HashtagU Telugu

Tamil Nadu: తమిళనాడులో పెరగనున్న మద్యం ధరలు.. బాటిల్ పై ఎంతంటే

Wine Shops Tenders Income for Telangana almost 2500 crores above

Wine Shops Tenders Income for Telangana almost 2500 crores above

Tamil Nadu: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) త్వరలో తమ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించే మద్యం ధరలను బాటిల్‌కు రూ.5 నుండి రూ.50 వరకు పెంచాలని యోచిస్తోంది. వైన్స్ నిర్వాహకులు ప్రస్తుతం ఈ ప్రతిపాదన కోసం ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.

రాష్ట్రవ్యాప్తంగా 500 ఔట్‌లెట్లు మూతపడడం వల్ల ఆదాయం తగ్గడంతో దాన్ని భర్తీ చేసేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ద్వారా లేదా ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ధరల పెరుగుదలను చేయవచ్చు.  అయితే ఈసారి కార్పొరేషన్ ఒక బాటిల్‌కు రూ. 5 నుండి రూ. 50 వరకు మరింత పెంచాలని ఆలోచిస్తోంది” అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

ఈ ప్లాన్‌లో రమ్, విస్కీ, బ్రాందీ, జిన్ (180 మి.లీ)లకు రూ. 5, 375 మి.లీ, 750 మి.లీ బాటిళ్లకు వరుసగా రూ.10, రూ.20 పెంచారు. అదనంగా, బీర్ ధరలు బాటిల్‌కు రూ. 10 పెరగవచ్చు. అయితే మీడియం, ప్రీమియం బ్రాండ్‌లు యూనిట్‌కు రూ. 10 నుండి రూ. 50 వరకు పెరిగే అవకాశం ఉంది. “ఈ పెంపు ద్వారా టాస్మాక్ అదనంగా రూ.1,500 కోట్లు సంపాదించవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో 2022-23లో కార్పొరేషన్‌ ఆదాయం రూ. 45,000 కోట్లు’’ అని ఓ అధికారి తెలిపారు.