Site icon HashtagU Telugu

Minister Daughter Love Marriage : మంత్రి కూతురు లవ్ స్టోరీ ఇంకా ముగియలేదు..?

Minister Shekhar Babu, Jayakalyani

Minister Shekhar Babu, Jayakalyani

తమిళనాడు డీఎంకే సీనియర్ నేత, మంత్రి శేఖర్ బాబు కూతురు ల‌వ్ మ్యారేజ్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. స‌తీష్ అనే యువ‌కుడిని మంత్రి శేఖ‌ర్ బాబు కుమార్తె జ‌య‌క‌ళ్యాణి ప్రేమించింది. వారి ప్రేమ‌కు మంత్రి శేఖ‌ర్ బాబు అంగీక‌రించ‌లేదు. ఈ క్ర‌మంలో క‌ళ్యాణి ల‌వ‌ర్ స‌తీష్‌ను రెండు నెల‌ల‌పాటు పోలీసుల‌తో నిర్భందించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన సతీష్ జయకల్యాణిని తీసుకుని వెళ్లి బెంగళూరులోని హిందూ ధార్మిక సంస్థలోఇటీవ‌ల పెళ్లి చేసుకున్నారు.

ఇంట్లో పెద్ద‌లు తమ ప్రేమను ఒప్పుకోకపోవడంతో ఇలా ప్రేమ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని జయకళ్యాణి వీడియో విడుదల చేసింది. ఈ క్ర‌మంలో తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని, ఆమెతో పాటు ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని, తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని, దీంతో పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఈ కొత్త జంట ఓ వీడియో కూడా విడుదల చేసింది.

అయితే మ‌రోవైపు తమిళనాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌కు మంత్రి శేఖర్‌బాబు అత్యంత సన్నిహితుడు. అధికార పార్టీ మంత్రి కూతురు ల‌వ్ స్టోరీ కావ‌డంతో ఈ అంశం పై త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల్లో ఆశ‌క్తి నెల‌కొంది. అందులోనూ అందులోనూ వీరు ఇంట్లో వారిని ఎదురించి పెళ్లి చేసుకోవ‌డ‌మే కాకుండా, స్వ‌యంగా త‌న తండ్రే వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులను కూడా ఆశ్ర‌యించారు. అందుకే వీరి ప్రేమ‌క‌థ‌ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అవుతోంది. ఇక కుమార్తె ల‌వ్ మ్యారేజ్‌పై మంత్రి శేఖ‌ర్ బాబు కుంటుంబం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేద‌ని అక్క‌డి మీడియా వ‌ర్గాలు చెప్పాయి. మ‌రి మంత్రి త‌న‌య ప్రేమ పెళ్ళి సుఖాంత‌మా లేక విష‌దంగా ముగుస్తుందో చూడాలి.

Exit mobile version