Site icon HashtagU Telugu

Tamil Nadu : నవంబర్ 6న నిర్వహించే RSSమార్చ్ కు షరతులతో కూడిన అనుమతి..!!

Tamilnadu Dgp

Tamilnadu Dgp

తమిళనాడులో నవంబర్ 6న నిర్వహించ తలపెట్టిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)మార్చ్ కు తమిళనాడు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తమిళనాడు డీజీపీ సైలేంద్రబాబు అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ లు, కమిషనర్ లకు ప్రకటన విడుదల చేశారు. ప్రజల భద్రత, ట్రాఫిక్, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుని జాగ్రత్తగా మార్చ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చ్ సమయంలో కవర్ కీపింగ్ అనుమతి లేదని డీజీపీ తెలిపారు.

ఇది కూడా చదవండి: సామాన్యులకు శుభవార్త. నేటి నుంచి అమల్లోకి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.!!

కాగా సెప్టెంబరు 22న మార్చ్ నిర్వహించేందుకు అనుమతిని పున:సమీక్షించాలంటూ తమిళనాడు పోలీసులు గతంలో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) దాడులు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) నేతల అరెస్టు ఆధారంగా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మతపరమైన సున్నితమైన స్వభావం ఉన్నందున మార్చ్ తోపాటు తదుపరి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించడానికి పరిస్థితి అనుకూలంగా లేదని పోలీసులు తెలిపారు.

ఏడు ఇంటెలిజెన్స్ నివేదికలను సమర్పించిన పోలీసుల నివేదికను హైకోర్టు ఆమోదించింది. పిఎఫ్‌ఐ కేంద్రాలపై దాడుల నేపథ్యంలో మతపరమైన ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 6న రూట్ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.