Tamil Nadu CM : సీఎం స్టాలిన్ కు కరోనా!

తమిళనాడు ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది.

  • Written By:
  • Publish Date - July 13, 2022 / 12:24 PM IST

తమిళనాడు ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు జ్వరం ఉందని, ఆందోళన చెందవద్దని పార్టీ నేతలకు చెప్పారు. ఒకటి లేదా రెండు రోజుల్లో కోలుకుంటానని, తిరిగి విధుల్లోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తతం వైద్యుల సూచన మేరకు స్టాలిన్ హోం ఐసోలేషన్ కు పరిమితమయ్యారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, బౌతిక దూరం పాటించాలని  ఈ సందర్బంగా స్టాలిన్ సూచించారు. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 2,448 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి, మొత్తం 35,03,977కి చేరుకుంది. గత 24 గంటల్లో 2,465 మంది రోగులు డిశ్చార్జ్ కాగా, 18,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసులలో చెన్నైలో 796 వరకు నమోదయ్యాయి.