Tamil Nadu: మోడీజీ సాయం చేయండి ప్లీజ్, ప్రధానికి సీఎం స్టాలిన్ రిక్వెస్ట్

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 06:50 PM IST

Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో తుపాను కారణంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రూ.5,060 కోట్లను కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం లేఖ రాశారు. ప్రియమైన గౌరవనీయులైన PM మోడీగారు.. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టుపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. మా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. అందుకే లేఖ రాస్తున్నాను అని స్టాలిన్ అన్నారు.

తక్షణ పునరుద్ధరణ ప్రయత్నాల కోసం స్టాలిన్ రూ.5060 కోట్ల మధ్యంతర సాయాన్ని కూడా అభ్యర్థించారు. “అదనంగా, మేము మరింత నిధుల అవసరాన్ని అంచనా వేయడానికి సమగ్ర నివేదికను సిద్ధం చేసే ప్రక్రియలో ఉన్నాం. మా ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల నుండి మరింత బలంగా బయటపడతామని నేను విశ్వసిస్తున్నాను” స్టాలిన్ అన్నారు..

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోందని, అదనపు నిధుల కోసం GOIకి వివరణాత్మక నివేదిక పంపుతామని ముఖ్యమంత్రి చెప్పారు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని కూడా నియమించాలని సీఎం కోరారు. ఇదిలా ఉండగా, నగరంలోని పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నందున చెన్నై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలను డిసెంబర్ 7న కూడా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.