TN CM: నియంత‌ను కూడా కాగ‌ల‌ను: సీఎం స్టాలిన్‌

ప్ర‌జాస్వామ్య‌వాదిగా ఉండే త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఒక్క‌సారిగా డీఎంకే లీడ‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు.

Published By: HashtagU Telugu Desk
Tamil Nadu CM Stalin

Tamil Nadu CM Stalin

ప్ర‌జాస్వామ్య‌వాదిగా ఉండే త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఒక్క‌సారిగా డీఎంకే లీడ‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. నియంత‌లాగా కూడా వ్య‌వ‌హ‌రించ‌గ‌ల‌నంటూ హెచ్చ‌రించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదని ఆయన అన్నారు. పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన నమక్కల్ లో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో అవినీతి రహిత పాలన అందించాలంటూ కర్తవ్య బోధ చేశారు. తప్పుడు పనులకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని స్టాలిన్ వార్నింగ్ ఇచ్చారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌ గీత దాటినా, పార్టీ సిద్ధాంతాలను అతిక్రమించినా, అవినీతికి పాల్పడినా పార్టీపరమైన చర్యలే కాకుండా, వారిని కోర్టుకీడ్చుతామని హెచ్చ‌రించారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమని, కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు నియంతగా కూడా మారగలనని స్టాలిన్ వార్నింగ్ ఇవ్వ‌డం డీఎంకేలో క‌ల‌క‌లం రేపుతోంది.

“పంచాయతీ వార్డ్ మెంబర్ నుంచి కార్పొరేషన్ మేయర్ వరకు నేను చెప్పేది ఒక్కటే, మీపై ఎలాంటి ఫిర్యాదులు, ఆరోపణలు లేకుండా చూసుకోండి. రాష్ట్రాన్ని నడిపిస్తామన్న ఉద్దేశంతో ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు. డీఎంకేతోనే తమిళనాడు భవిష్యత్తు సాధ్యం. పార్టీకి మచ్చ తీసుకురావొద్దు” అంటూ హిత‌బోధ చేశారు. అంతేకాదు, స్థానిక సంస్థల మహిళా ప్రజాప్రతినిధులకు కూడా ఉద్బోధ చేశారు. “ప్రజాప్రతినిధులుగా ఉంటూ మీ భర్తలకు అప్పగించకండి అంటూ మ‌హిళ‌ల‌కు సూచించారు.

  Last Updated: 04 Jul 2022, 05:49 PM IST