Site icon HashtagU Telugu

Tamil Nadu BJP Chief: తమిళనాడు బీజేపీ చీఫ్ కి 33 మంది కమాండోలతో Z కేటగిరీ భద్రత

bjp

Resizeimagesize (1280 X 720) (1) 11zon

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు (Tamil Nadu BJP Chief) కె. అన్నామలైకి హోం మంత్రిత్వ శాఖ జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. అన్నామలైకి ఇంతకు ముందు వై కేటగిరీ భద్రత ఉండేది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మొత్తం 33 మంది కమాండోలతో ఈ భద్రతను కల్పించనున్నారు. అన్నామలైకి ప్రమాదం పెరుగుతుందని ఆయనకు ఈ భద్రత కల్పించారు. మావోయిస్టులు, తీవ్రవాదుల నుంచి అన్నామలైకు బెదిరింపులు వస్తున్నాయి. ప్రస్తుత తమిళనాడు బిజెపి అధ్యక్షుడికి మావోయిస్టులు, మతపరమైన తీవ్రవాదుల నుండి బెదిరింపులు వస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి IB బెదిరింపు నివేదిక తర్వాత.. అన్నామలైకి Z కేటగిరీ భద్రత కల్పించారు. తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఇస్లామిక్ టెర్రరిజం స్లీపర్ సెల్స్ పెరుగుతున్నారు. నిషేధిక పీఎఫ్ఐ కార్యకలాపాలు సైతం పెరుగుతున్నాయి.

Also Read: 10 Dead In Bus Accident: హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం

IB నివేదిక ఆధారంగా.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లోక్‌సభ సభ్యుడు చిరాగ్ పాశ్వాన్‌కు Z కేటగిరీ VIP భద్రతను కూడా ఇచ్చింది. బీహార్‌లో వారికి ఈ భద్రత కల్పించనున్నారు. IB థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ ఆధారంగా.. పాశ్వాన్‌కు ఈ భద్రత కల్పించారు. ఈ నివేదిక వెలువడిన తర్వాత చిరాగ్ పాశ్వాన్‌కు భద్రత పెంచాలని ఎల్‌జేపీకి చెందిన పాశ్వాన్ వర్గం డిమాండ్ చేసింది. ఇందులో చిరాగ్‌కి బీహార్‌లో ప్రాణహాని ఉందని చెప్పారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో చిరాగ్ పాశ్వాన్‌కు ప్రభుత్వంలో పెద్ద బాధ్యత వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చిరాగ్ పాశ్వాన్‌కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. కొద్దిరోజుల క్రితం చిరాగ్ పాశ్వాన్ కేంద్ర హోంమంత్రిని కలిసినప్పుడు.. చిరాగ్ పాశ్వాన్ పట్ల అధికార పార్టీ సంతోషంగా ఉందని, ఆయనకు ప్రభుత్వంలో చోటు దక్కే అవకాశం ఉందని అప్పటి నుంచి ఊహాగానాలు సాగుతున్నాయి.