Site icon HashtagU Telugu

Tamil Hero Vishal New Party : హీరో విశాల్ కొత్త రాజకీయ పార్టీ?

Vishal New Party

Vishal New Party

తమిళనాట (Tamil ) ఈసారి ఎన్నికల (Elections) హోరు మాములుగా ఉండబోతలేదు..తమిళలంతా అగ్ర హీరోలు సైతం ఈసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం , కొత్త పార్టీలతో బరిలోకి దిగబోతుండడం తో తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ (VIjay) కొత్త పార్టీని ప్రకటించగా మరో నటుడు విశాల్ (Vishal) సైతం కొత్త పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విశాల్ అంతకుముందు ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించగా నామినేషన్‌ తిరస్కరించారు. ఈ క్రమంలోనే తన అభిమాన సంఘాన్ని ‘విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం’ (విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జులను నియమించారు. బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు షూటింగ్‌లకు వెళ్లిన సమయంలో అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని తగిన సాయం చేస్తూ, పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టి..ప్రజలంతా మరింత సేవ చేయాలనీ భావిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

త్వరలోనే విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం నిర్వాహకులను చెన్నైకి పిలిపించి సమాలోచన జరపనున్నట్లు తెలుస్తోంది. వారితో మాట్లాడి పార్టీని విశాల్‌ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. విజయ్‌ లాగే విశాల్‌ కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవరని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని తెలుస్తుంది.దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల కోలీవుడ్ ప్రజలే కాదు తెలుగు ప్రజలు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. చిత్రసీమ నుండి ఇప్పటికే ఎంతోమంది కళాకారులు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా , ఎంతో ఉన్నంత స్థాయికి చేరుకొని ప్రజలకు సేవ చేసారు. మరికొంతమంది మాత్రం రాజకీయాల్లో రాణించలేక వెనుతిరిగిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు తో పాటు పలు భాషల్లోని నటి నటులు రాజకీయాల్లో రాణిస్తుండగా..తాజాగా కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఫై ప్రతి ఒక్కరు స్పందిస్తూ వెల్ కం చెపుతున్నారు.

Read Also : AP Interim Budget : బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బుగ్గన బడ్జెట్..