Vijaykanth : తమిళ్ సీనియర్ హీరో విజయ్ కాంత్ కాలివేళ్లు తొలగించిన వైద్యులు..!!

తమిళ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు DMDKపార్టీ చీఫ్ విజయ్ కాంత్ కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.

  • Written By:
  • Publish Date - June 22, 2022 / 06:11 PM IST

తమిళ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు DMDKపార్టీ చీఫ్ విజయ్ కాంత్ కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా విజయ్ కాంత్ ఆరోగ్యం విషయం గురించి DMDK పార్టీ అఫీషియల్ ప్రకటన చేసింది. విజయ్ కాంత్ హెల్త్ అప్ డేట్ ను ప్రకటించింది. ఆయన కొంతకాలంగా డయాబెటిస్ తో బాధపడుతున్నారని…కుడి కాలి వేళ్లకు రక్తం సరఫరా కావడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో కుడికాలికి సంబంధించిన మూడు వేళ్లను వైద్యులు తొలగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కాగా విజయ్ కాంత్ అరోగ్యంపై అసత్యాలు ప్రచారం చేయవద్దని DMDKప్రకటించింది. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని..మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని పార్టీ తెలిపింది. కాగా విజయ్ కాంత్ అనారోగ్యం గురించి తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆకాంక్షించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియాలో స్పందించారు. తన ప్రియమైన స్నేహితుడు విజయ్ కాంత్ తొందరగా కోలుకుని గతంలో మాదిరిగానే కెప్టెన్ లా గర్జించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానంటూ తెలిపారు.