Actor Vijay : దళపతి విజయ్ కీలక నిర్ణయం.. వారి కోసం ప్రత్యేక కార్యక్రమం

తమిళ నటుడు దళపతి విజయ్ సేవా కార్యక్రమాల ద్వారా యువత, విద్యార్థులతో మమేకం అవుతున్నారు. 

  • Written By:
  • Updated On - June 11, 2024 / 08:37 AM IST

Actor Vijay : తమిళ నటుడు దళపతి విజయ్ సేవా కార్యక్రమాల ద్వారా యువత, విద్యార్థులతో మమేకం అవుతున్నారు.  త్వరలో ఆయన మరో సేవా కార్యక్రమం చేయబోతున్నారు. టెన్త్ క్లాస్, ఇంటర్ సెకండియర్‌లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను విజయ్ సన్మానించబోతున్నారు. దీనికి సంబంధించిన రెండు కార్యక్రమాలను చెన్నైలోని శ్రీరామచంద్ర కన్వెన్షన్ సెంటర్‌లో జూన్ 28, జులై 3 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈవిషయాన్ని విజయ్‌కు చెందిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం ఓ ప్రకటనలో తెలిపింది.  ఈ కార్యక్రమం సందర్భంగా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో విజయ్ సర్టిఫికెట్లు, నగదు ప్రోత్సాహకాలను అందజేస్తారని వెల్లడించింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ముందే విజయ్ తన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే తాను 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి జాతీయ నాయకుల గురించి విస్తృతంగా చదవాలని విద్యార్థులకు విజయ్(Actor Vijay) తరుచుగా చెబుతుంటారు.  విజయ్ రాజకీయాల్లోకి వస్తారనే  ప్రచారం గత పదేళ్లుగా జరుగుతోంది. అయితే ఈ ఏడాది విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించడంతో  ఆ ప్రచారం నిజమేనని తేలిపోయింది. చాలా ఏళ్లుగా తన అభిమాన సంఘాల ద్వారా విజయ్ తమిళనాడువ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పేదలకు ఉచిత ఆహార పంపిణీ, విద్యార్థులకు స్కాలర్‌షిప్, లైబ్రరీలు, న్యాయ సహాయం, సాయంత్రం ట్యూషన్ వసతి వంటి ఏర్పాట్లను విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా చేస్తున్నారు.  గతంలో విజయ్ నటించిన పలు  సినిమాలు సున్నితమైన రాజకీయ అంశాలను టచ్ చేయడంతో వివాదాలు రాచుకున్నాయి. విజయ్ ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో జనాలు వస్తుంటాయి. వాటిని ఓట్లుగా మలుచుకోవాలని ఆయన భావిస్తున్నారు. తమిళనాడులో గతంలో అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, కరుణానిధి, జయలలిత వంటి ప్రముఖులు ముఖ్యమంత్రులు అయ్యారు. విజయ్‌ విషయంలో తమిళనాడు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచిచూడాలి.

Also Read : Aircraft Missing : మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం మిస్సింగ్