Site icon HashtagU Telugu

Swami Nithyananda: నేను చనిపోలేదు భక్తా! జస్ట్ సమాధిలోకి వెళ్లానంతే! నిత్యానంద స్వామి కొత్త స్టేట్ మెంట్!

Nithyanand

Nithyanand

నిత్యానంద స్వామి ఏం చెప్పినా అది సంచలనంగా మారుతోంది. ఎందుకంటే ఆయన స్టేట్ మెంట్లలో అతిశయోక్తి కనిపిస్తోందంటున్నారు భక్తులు. ఈమధ్యన తాను చనిపోయినట్టు వార్తలు వచ్చాయని.. కానీ అదంతా అబద్దమన్నారు. తాను బతికే ఉన్నానన్నారు. 27 మంది వైద్యులు తనకు ట్రీట్ మెంట్ ఇస్తు్న్నారని చెప్పారీ ఆధ్యాత్మిక గురువు. దీనికి సంబంధించి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ కూడా పెట్టారు.

ప్రస్తుతం తాను సమాధిలో ఉన్నానని.. శిష్యులు కంగారు పడొద్దని భరోసా ఇచ్చారు. దీంతో ఆయన భక్తులు కాస్త తెరిపిన పడ్డారు. ఆధ్యాత్మిక గురువులు సుప్తావస్థలో ఉండడాన్నే సమాధిగా చెబుతారు. ఇప్పుడున్న స్థితిలో తాను మాట్లాడలేనన్నారు. ప్రస్తుతానికి మనుషుల పేర్లు, ప్రాంతాల పేర్లు ఏవీ గుర్తుకు రావడంలేదన్న స్వామి.. దానికి కొంత సమయం పడుతుందని తేల్చేశారు.

నిత్యానందకు భక్తగణం ఎక్కువ. కానీ గతంలో ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణలతో వివాదం మొదలైంది. దీంతో ఆయనపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల కోసం దాదాపు 50 సార్లు న్యాయస్థానానికి హాజరు కాక తప్పలేదు. తరువాత 2019 నవంబర్ లో ఉన్నట్టుండి ఆయన కనిపించకుండా పోయారు. సడన్ గా తెరపైకి వచ్చి తాను కైలాసంలో ఉన్నానన్నారు. అది నిత్యానంద సృష్టించుకున్న ప్రపంచం. దాంతో ఆయన దేశం వదిలి పారిపోయారని అందరికీ తెలిసింది.

ఈక్వెడార్ కు సమీపంలోని ఓ దీవిలో ఆయన ఉంటున్నట్టు తెలుస్తోంది. ఆ దేశం మాత్రం దీనిని ఖండిస్తున్నా.. నిత్యానంద ఆ ద్వీపం విషయంలో చాలా అడ్వాన్స్ స్టేజ్ కు వెళ్లిపోయారు. కైలాస దేశానికి తానే ప్రధాని అని చెప్పారు. పైగా ఆ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి దరఖాస్తు కూడా పంపించారు. ఆయన అక్కడితో ఆగలేదు. కైలాస డాలర్ ను కూడా తీసుకురావడం, రిజర్వ్ బ్యాంక్
ఆఫ్ కైలాసను స్టార్ట్ చేసినట్లు చెప్పడంతో అసలు అక్కడ ఏం జరుగుతోందా అని అంతా ఫోకస్ పెట్టారు. కానీ ఆయన అక్కడ ఉంటున్నట్టు ఈక్వెడార్ మాత్రం స్పష్టం చేయడం లేదు.

Exit mobile version