Site icon HashtagU Telugu

Hijab Row: హిజాబ్ కేసు పై వెంటనే విచారణ చేపట్టలేం.. సుప్రీం కోర్టు

Hijab Row Supreme Court

Hijab Row Supreme Court

క‌ర్నాట‌క హిజాబ్ కేసు అంశం ప్ర‌స్తుతం సుప్రీం కోర్టుకు చేరిన సంగ‌తి తెలిసిందే. హిజాబ్ వివాదంపై ఇటీవ‌ల క‌ర్నాట‌క హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో క‌ర్నాట‌క హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్య‌తిరేకంగా కొందరు ముస్లిం విద్యార్థినులు సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ హిజాబ్ వివాదం పై వెంటనే విచార‌ణ జ‌ర‌ప‌లేమ‌ని గ‌తంలోనే సుప్రీం కోర్టు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టులో విచార‌ణ‌లో భాగంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్య‌తిరేకంగా పిటిషన్‌ వేసిన విద్యార్థినుల తరఫు న్యాయవాది దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఆదేశాల కారణంగా విద్యార్థులకు వార్షిక పరీక్షలో సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా, దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఈ కేసుకు పరీక్షకు ఎటువంటి సంబంధం లేదని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. ఈ క్ర‌మంలో హిజాబ్ కేసును వెంట‌నే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఇక‌పోతే కర్ణాటక హైకోర్టు హిజాబ్ ధరించడానికి అనుమతించాలంటూ బాలికల అభ్యర్థనను తిరస్కరించడంతో పలువురు ముస్లిం బాలికలు పరీక్షకు హాజరు కావడానికి నిరాకరించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పరీక్షకు హాజరుకాని బాలికలకు మళ్లీ పరీక్ష నిర్వహించబోమని అక్క‌డి ప్ర‌భుత్వం తెలిపింది. ఇక మ‌రోవైపు హిజాబ్‌పై తీర్పు వెలువరించిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురు న్యాయమూర్తుల ప్రాణాలకు ముప్పు ఉన్న నేప‌ధ్యంలో వారికి వై కేటగిరీ భద్రత కల్పించారు. ముగ్గురు న్యాయమూర్తులను చంపుతామని బెదిరిస్తున్న ఓ గుర్తు తెలియ‌ని వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.