Site icon HashtagU Telugu

Sunset: ఈ ప్రాంతాల్లో సూర్యుడు అస్తమించాడు.. రహస్యం ఏంటంటే?

Sunset

Sunset

సాధారణంగా సూర్యుడు తూర్పు వైపున ఉదయించి పశ్చిమం వైపున అస్తమిస్తాడు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా సూర్యుడు ఉదయించినప్పుడు పగలు, అస్తమించినప్పుడు రాత్రి ఏర్పడుతుంది. ఇలా ఈ భూమండలంలో పగలు రాత్రులు ఏర్పడటం మనకు తెలిసిందే. అయితే సుర్యుడు అస్తమించని ప్రదేశాలు కూడా ఉంటాయని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో సూర్యుడు అస్తమించని వారికి ఎల్లప్పుడూ పగలు మాదిరిగానే ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి సూర్యుడు అస్తమించని ప్రాంతాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

ఆర్కిటిక్ పరిధిలో ఉన్నటువంటి హమ్మర్ ఫెస్ట్ అనే నగరం ఉంది.ఈ ప్రాంతంలో సూర్యుడు ఎల్లప్పుడు ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు కేవలం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాత్రమే 40 నిమిషాల పాటు సూర్యుడు మేఘాల చాటుకు వెళ్లడం వల్ల మబ్బుగా ఉంటుంది. అలాగే ఐస్లాండ్ ఆవాస ప్రాంతాలలో కూడా జూన్ మాసంలో సూర్యుడు అస్తమించడు. ఇక్కడ రాత్రి పగలు ఒకే విధంగా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ దోమలు ఉండకపోవడం మరో విశేషం.

 

ప్రపంచంలో అతిపెద్ద దేశాలలో ఒకటైన కెనడాలోని యుకొన్ ఈ ప్రాంతంలో ఏడాది మొత్తం మంచు కురుస్తూ ఉంటుంది. అయితే వేసవికాలంలో ఏకంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. గ్రీన్ ల్యాండ్ కానాక్ ప్రాంతంలో సూర్యుడు శీతాకాలంలో ఈ ప్రాంతం అంతా చీకటిగా ఉండిపోగా వేసవికాలంలో విశ్వరూపం చూపిస్తాడు. స్వీడన్ లోని కీరూనా నగరంలో సూర్యుడు మే నుంచి ఆగస్టు వరకు అస్తమించకుండా కాంతులు వెదజల్లుతూ ఉంటాడు.

2

Exit mobile version