Avoid Cool Drinks: సమ్మర్ వస్తోంది.. కూల్ డ్రింక్స్ జోలికి పోవద్దు..

సమ్మర్ (Summer) వస్తోంది. ఇక అందరూ కూల్ డ్రింక్స్ తాగడానికి ప్రయార్టీ ఇస్తారు.

సమ్మర్ వస్తోంది. ఇక అందరూ కూల్ డ్రింక్స్ (Cool Drinks) తాగడానికి ప్రయార్టీ ఇస్తారు. కానీ అవి బాడీకి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయని మర్చిపోతారు. వీటికి బదులు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు,నిమ్మరసం, మజ్జిగ తాగితే బెస్ట్. నీళ్లు ఎక్కువగా తాగితే బెస్ట్.అంతే కాదు ఎండాకాలంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. స్ట్రాబెర్రీ,  సిట్రస్ జాతికి చెందిన పండ్లు తినాలి. ఇవి శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తాయి. ఎండాకాలంలో అందుబాటులో ఉండి మామిడి పండ్లలో పైబర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, వివిధ పోషకాలు చాలా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. ద్రాక్ష పండ్లు కూడా తినొచ్చు.

కూల్ డ్రింక్స్ (Cool Drinks) లోని అవి డేంజరస్

  1. కూల్ డ్రింక్స్ లో అధిక మొత్తంలో సోడా, షుగర్ కంటెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని నీటి స్థాయులను తగ్గిస్తాయి. దీంతో దాహం తీరకపొగ మరింత దాహం ఏర్పడుతుంది.
  2. వీటిలో ఉండే అధిక మొత్తంలోని చక్కెర స్థాయిలు శరీరంలో కొవ్వు స్థాయిలని ఒక్కసారిగా పెంచి శరీర బరువును అమాంతం పెంచుతాయి.
  3. కూల్ డ్రింక్స్ వల్ల  ఊబకాయం సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ చల్లని పానీయాలలో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది శరీరంలో డోపమైన్ అనే కెమికల్ ఉత్పత్తిని పెంచి  రక్తపోటును ఊహించని రీతిలో ఒక్కసారిగా పెంచుతాయి. ఫలితంగా గుండె పనితీరును మందగించి గుండె సమస్యలకు దారితీస్తుంది.
  4. కూల్ డ్రింక్స్ లలో ఫాస్ఫారిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని కాల్షియం స్థాయిలను పూర్తిగా తగ్గిస్తుంది. దీంతో ఎముకలు బలహీనపడి ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది.
  5. గర్భిణీ స్త్రీలు సాధ్యమైనంత వరకూ ఈ పానీయాలకు దూరంగా ఉండాలి. అప్పుడే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా బాగుంటుంది.
  6. కూల్ డ్రింక్స్ లో ఉండే హానికర కెమికల్స్ గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను రెట్టింపు చేసి జీర్ణశక్తిని తగ్గిస్తాయి.
  7. ఈ పానీయాలలో ఉండే పాస్ఫారిక్, కార్బోనిక్ ఆమ్లాలు నోటిలో ఆమ్ల స్థాయిలను పెంచి దంతక్షయానికి దారితీస్తాయి.
  8. కూల్ డ్రింక్స్ వల్ల నోటిలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది నోటి దుర్వాసన సమస్యలు కలుగుతాయి.

బోలెడు షుగర్

350మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ లో 35 నుండి 45 గ్రాముల షుగర్ ఉంటుంది. కూల్ డ్రింక్ తాగిన ఐదు నిమిషాల్లో శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మధుమేహం బారిన పడే అవకాశాలను 67% వరకూ కొని తెచ్చుకున్నట్లేనని చెప్పవచ్చు.ఇందులో ఉండే బ్రోమినేటెడ్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ అనే రసాయనానికీ నాడీ నష్టానికీ సంబంధం ఉంది. ఈ రసాయనంతో చర్మం మీద దద్దుర్లు కూడా తలెత్తుతాయి.కూల్‌ డ్రింక్స్‌ నిల్వ కోసం వాడే ఫాస్ఫేట్స్‌, ఫాస్ఫారిక్‌ యాసిడ్లు చర్మపు సాగే గుణాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా తక్కువ వయసులోనే వయసు పైబడిన వారిలా కనిపిస్తాం.

కృత్రిమ రంగులు, కృత్రిమ స్వీటెనర్లు

కూల్‌డ్రింకులకు ఆకర్షణీయమైన రంగులు తెచ్చిపెట్టే కృత్రిమ రంగులు, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను నాశనం చేస్తాయి. దాంతో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం క్రమేపీ తగ్గుతుంది.కూల్‌ డ్రింక్‌ తాగడం వల్ల రక్తంలో ట్రైగ్లిసరైడ్లు 30% పెరగుతాయి. ఇవి గుండె రక్తనాళాలను గట్టిపరుస్తాయి.కూల్ డ్రింక్స్ (Cool Drinks) లో కూడా కాఫీలో ఉండే కెఫిన్ ఉంటుంది. అదేపనిగా కూల్ డ్రింక్స్ తాగటం వల్ల నిద్రలేమి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

Also Read:  Tongue Health Tips: నాలుక తెల్లగా ఉందా? ఆ వ్యాధుల ముప్పు..