Site icon HashtagU Telugu

Viral : కూతురి ఇష్టాన్ని తీర్చేందుకు తండ్రి చేసిన సాహసం..

Elderly Man Carries Bunch O

Elderly Man Carries Bunch O

మనం గెలిచినప్పుడు పది మందికి చెప్పుకుని ఆనందపడే వ్యక్తి, అలాగే మనం ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలుస్తావులేరా అని ప్రోత్సహించే వ్యక్తి బహుశా ఈ ప్రపంచంలో నాన్న ఒక్కడేనేమో!!.. బిడ్డను కని పెంచే బాధ్యత తల్లిది అయితే, పోషించే బాధ్యత తండ్రిది. తండ్రి మూలంగా పిల్లలకు సంఘంలో గుర్తింపు, హోదా ఇవన్నీ కూడా తండ్రి నుండే వస్తాయి. తన పిల్లలను పెంచేందుకు తండ్రి ఎన్నో కోల్పోతాడు..పిల్లల ఆనందమే తన ఆనందంగా భావిస్తుంటాడు. అలాంటి ఓ తండ్రి తన కూతురి ఇష్టాన్ని తీర్చేందుకు ఎంతగా కష్టపడ్డాడనేది తాజాగా ఓ వీడియో తెలుపుతూ వైరల్ గా మారింది. తన కూతురికి చెరుకు గడలంటే ఇష్టమని 14 కిలోమీటర్లు చెరుకు గడలను తల మీద పెట్టుకొని సైకిల్ తొక్కాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ వీడియో నే దర్శనం ఇస్తుంది. ఈ ఘటన తమిళనాడు లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

తన కూతురు సుందరపాల్‌కి పెళ్లయి పదేళ్లయినా పిల్లలు పుట్టలేదని.. చివరికి ఎనిమిదేళ్ల క్రితం కవల పిల్లలకు జన్మనిచ్చిందని .. అప్పటినుంచి తలపై చెరకు గడలు మోస్తూ సైకిల్‌ తొక్కుతూ ఆమెకు పొంగల్ కానుకగా ఇవ్వడం మొదలుపెట్టాడు ఆ తండ్రి.. తాను ఆరోగ్యంగా ఉన్నానని, అందుకే తన కూతురు, మనవళ్లను చూసేందుకు సైకిల్‌పై సంతోషంగా ప్రయాణాలు చేస్తున్నాని చెప్పుకొచ్చాడు. తలపైన కొన్ని చెరకు గడలను పెట్టుకొని సైకిల్ పై ప్రతి ఏడు తన కూతురి సంతోషాన్ని తీరుస్తుంటాడు. ఈసారి కూడా అలాగే సైకిల్ తీసుకొని.. సరుకులు సైకిల్ పై పెట్టి..తలపై చెరుకు గడలు పెట్టుకొని.అవి వొత్తుకోకుండా తలపై ఒక టవల్ పెట్టుకొని ఇంటినుండి బయలుదేరాడు. ఆలా సైకిల్ ఫై వస్తుంటే ప్రజలు అతన్ని ఆశ్చర్యంతో చూస్తూ.. మార్గం మధ్యలో అతనిని ఉత్సహ పరుస్తూ వచ్చారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ తండ్రి ఫై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు.

Read Also : Prashanth Varma : హనుమాన్ సినిమాపై, మా టీంపై నెగిటివ్ ప్రమోషన్స్ చేస్తున్నారు.. డైరెక్టర్ సంచలన ట్వీట్..