Site icon HashtagU Telugu

Puneeth RajKumar: తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ అంత్యక్రియలు..

బెంగళూరు: అశేష జనవాహిని మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య ఇవాళ ఉదయం కన్నడ సూపర్ స్టార్ కు తుది వీడ్కోలు పలికారు.

కంఠీరవ స్టూడియోలో తల్లిదండ్రులు సంధివద్దనే పునీత్ అంతిమ సంస్కరాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. రాఘవేంద్ర కుమారుడు విన‌య్ తలకొరివి పెట్టాడు.

కుటుంబ సభ్యులు, కర్ణాటక సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పునీత్ రాజ్ కుమార్ కు కన్నీటి మధ్య తుది వీడ్కోలు పలికారు. ఈ అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉదయం 4.40 కే మొదలైన అంతిమ యాత్ర 16 కిలోమీటర్ల మేర జరిగింది.

Exit mobile version