Site icon HashtagU Telugu

Acid Attack: ప్రేమకు నో చెప్పిందని యువతిపై యాసిడ్ దాడి

Crime

బెంగళూరు లో అమానుషం జరిగింది. సుంకదకట్టే ప్రాంతంలోని ముత్తూట్ కంపెనీ కార్యాలయం సమీపంలో యువతి పై ఓ ఆగంతకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. యాసిడ్ దాడి జరిగిన వెంటనే కుప్పకూలిన ఆమెను స్థానికులు చూసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి ని పోలీసులు నగేష్ గా గుర్తించారు. యాసిడ్ దాడి చేయడానికి ఒకరోజు ముందు(బుధవారం సాయంత్రం).. నగేష్ ఆ యువతి పనిచేసే ఆఫీస్ కు వెళ్లి ఆమెను కలిశాడు. తనను ప్రేమించాలంటూ బలవంతం చేశాడు. యువతి తో ఆ ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగులు పోలీసులను పిలుస్తామని చెప్పడంతో .. నగేష్ ఆరోజు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు (గురువారం) ఉదయం యువతి ఆఫీస్ కు వస్తుండగా దారి మధ్యలో అటకాయించి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.

Exit mobile version