Site icon HashtagU Telugu

Sri Sri Ravishankar: ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Sri Sri Ravishankar

Resizeimagesize (1280 X 720) (2) 11zon (1)

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ (Sri Sri Ravishankar)కు చెందిన హెలికాప్టర్ తమిళనాడులోని ఈరోడ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేశారు. ఈ చాపర్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు.

Also Read: Road Accident in America: అమెరికాలో యాక్సిడెంట్.. తెలుగు యువతి దుర్మరణం

ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ మరో నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన హెలికాప్టర్‌ను ఉదయం 10.40 గంటలకు ఈరోడ్‌లోని సత్యమంగళంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో హెలికాప్టర్ మళ్లీ బయలుదేరింది. దాదాపు 50 నిమిషాల తర్వాత హెలికాప్టర్ బయలుదేరింది.