Site icon HashtagU Telugu

Transgender Ticket Inspector: తొలి రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా హిజ్రా

Transgender Ticket Inspector

Safeimagekit Resized Img (2) 11zon

Transgender Ticket Inspector: తమిళనాడులో తొలిసారిగా రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్ (Transgender Ticket Inspector)గా నాగర్‌కోవిల్‌కు చెందిన హిజ్రా సింధు నియమితులయ్యారు. సింధు దిండుక్కల్‌ రైల్వే డివిజన్‌లో టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని, హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందని సింధు తెలిపారు. హిజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా చదువుకోని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.

దక్షిణ భారతదేశంలో రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా మారిన మొదటి ట్రాన్స్‌జెండర్ ఎవరు? బహుశా మీలో చాలా మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవచ్చు. సరైన సమాధానం – సింధు. సింధు 19 ఏళ్ల క్రితం కేరళలోని ఎర్నాకులంలో రైల్వేలో చేరింది. ఆ తర్వాత తమిళనాడులోని దిండిగల్‌కు బదిలీ అయ్యారు. ఆమె గత 14 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు.

Also Read: Elon Musk Phone Number: ఎలాన్ మస్క్ మరో సంచలనం.. ఎక్స్‌ ద్వారా ఆడియో, వీడియో కాల్స్..!

ట్రాన్స్‌జెండర్లు గౌరవం పొందడానికి కృషి చేయాలి

అందుతున్న సమాచారం ప్రకారం.. సింధు ప్రమాదంలో గాయపడింది. ఆ తర్వాత ఆమెను రైల్వే వాణిజ్య విభాగానికి పంపారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందేందుకు కృషి చేయాలని సింధు అభిప్రాయపడ్డారు. టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా మారడం గర్వంగా ఉందన్నారు.

We’re now on WhatsApp : Click to Join

‘విద్య ద్వారా ఎంతటి ఔన్నత్యమైనా సాధించవచ్చు’

సౌత్ ఇండియా తొలి ట్రాన్స్‌జెండర్ టికెట్ ఇన్‌స్పెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవం దక్కేలా కృషి చేయాలని అన్నారు. చదువు, కష్టపడితే ఎంతటి ఔన్నత్యమైనా సాధించవచ్చని గట్టిగా నమ్ముతాన‌ని ఆమె అన్నారు.

‘రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ కావడానికి చాలా కష్టపడ్డాను’

రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ని అయినందుకు గర్వపడుతున్నాను అని సింధు తెలిపింది. ఈ స్థానం సాధించేందుకు చాలా కష్టపడ్డాను. ట్రాన్స్ జెండర్లను సమాజం ఇప్పటికీ పూర్తిగా అంగీకరించలేకపోతున్న సంగతి తెలిసిందే. వారు బహిష్కరణను ఎదుర్కొంటారు. అయితే వీరిని థర్డ్ జెండర్‌గా గుర్తించి సుప్రీంకోర్టు గౌరవించింది.