Snake Skin In Food: పరోటాల పార్శిల్ లో పాము చర్మం!!

ఆమె ఒక హోటల్ కు వెళ్లి రెండు పరోటాలు కొని పార్శిల్ కట్టించుకుంది. ఇంటికి వెళ్లి ఆ పార్శిల్ తెరిచి చూస్తే.. అందులో పరోటాలతో పాటు పాము చర్మం కనిపించింది.

  • Written By:
  • Publish Date - May 9, 2022 / 07:15 PM IST

ఆమె ఒక హోటల్ కు వెళ్లి రెండు పరోటాలు కొని పార్శిల్ కట్టించుకుంది. ఇంటికి వెళ్లి ఆ పార్శిల్ తెరిచి చూస్తే.. అందులో పరోటాలతో పాటు పాము చర్మం కనిపించింది. ఈ చేదు అనుభవం కేరళలోని తిరువనంతపురం నగరంలో ఉన్న నెదుమంగడ్ ప్రాంతానికి చెందిన ప్రియకు ఎదురైంది. హోటల్ నిర్వాకంపై కోపగించుకున్న ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే పోలీసుల సూచన మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులను కలిసి .. జరిగిన విషయాన్ని చెప్పింది. సంబంధిత అధికారులు రంగంలోకి దిగి హోటల్లో తనిఖీలు నిర్వహించి, ఆహార నాణ్యత, పరిశుభ్రత వంటివి పరిశీలించి చర్యలు తీసుకున్నారు. హోటల్‌ను మూసేశారు. “హోటల్ దారుణంగా ఉంది. వంటగదిలో సరిగ్గా వెలుతురు లేదు. హోటల్ బయట చెత్త ఉంది. హోటల్‌ను మూసివేసి, షోకాజ్ నోటీసును ఇచ్చాం” అని నెడుమంగాడ్ సర్కిల్ ఫుడ్ సేఫ్టీ అధికారి అర్షిత బషీర్ తెలిపారు.
వాస్తవానికి హోటళ్లు, రెస్టారెంట్‌ల్లో కచ్చితంగా పరిశుభ్రత పాటించాలి. లేదంటే వినియోగదారుల ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.